పేదల గుడిసెలపై ప్రతాపమా?.. ఎమ్మెల్యే గాంధీ తీరుపై మాధవరం నిప్పులు!
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, డిసెంబర్ 18:అభివృద్ధి పేరిట పేదల ఇళ్లను కూల్చివేయడం అమానుషమని, ఎమ్మెల్యేగా ఉండి ప్రజలను కాపాడాల్సింది పోయి దగ్గరుండి ఇళ్లను కూల్చివేయడం అరికెపూడి గాంధీ వైఫల్యానికి నిదర్శనమని కూకట్‌పల్లి ఎమ్మెల్యే & శేరిలింగంపల్లి బిఆర్ఎస్ ఇంచార్జ్ మాధవరం కృష్ణారావు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో 100 ఫీట్ల రోడ్డు విస్తరణలో భాగంగా కూల్చివేసిన ఇళ్లను గురువారం ఆయన 124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఇన్చార్జి 𝗕𝗥𝗦 𝗣𝗮𝗿𝘁𝘆 సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో BRS పార్టీ శ్రేణులతో కలసి సందర్శించారు. బాధితులను పరామర్శించి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు...
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ తీరుపై మండిపడ్డారు. ఎల్లమ్మబండ ప్రభుత్వ భూమి అని, అక్కడ నివసిస్తున్న వారు నిరుపేదలని గాంధీకి తెలియదా.?
గతంలో ఎన్నోసార్లు ఈ విషయాన్ని ఆయనే ప్రస్తావించారు.
ఇప్పుడు స్వయంగా ఆయనే రంగంలోకి దిగి నిరుపేదల నీడను దూరం చేయడం ఏ రకమైన రాజకీయం? అని ప్రశ్నించారు.



Comment List