అది ఆటో స్టాండ్ కాదు..,!
ఐ ఎన్ బి టైమ్స్ న్యూస్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:మాచర్ల పట్టణంలోని 14 వ వార్డు అంజని స్వీట్స్ పక్క గల్లి రోడ్డులో ప్రతిరోజు ఆటో వాళ్ళు, వ్యాన్ వాళ్ళు, రోడ్డుకు అడ్డంగా వాహనాలు అడ్డుపెట్టి ఏమాత్రం తీయరు. ఆ గల్లీలో తిరిగే పాదాచారులు, నివాసితులు, మహిళలు ఇదేమిటి వాహనాలు అడ్డుగా పెట్టారు అని, ప్రశ్నించిన వారిపై ఎగబడటానికి సిద్ధమవుతున్నారు. ఈ వీధి గుండా రెండు బజార్ల ప్రజలు, 13వ వార్డు లోని వారు నివాసాలకు రాకపోకలు సాగిస్తారు. వీరికి తోడు రైల్వే స్టేషన్ కి వెళ్లేవారు కూడా కొంతమంది ఈ బజారు గుండా వెళుతుంటారు . వాహనాలు రహదారికి అడ్డుపెట్టిన సమయంలో మహిళలు చిన్నపిల్లలు మార్కెట్ కి రావడానికి ఏమాత్రం కుదరదు. స్కూలుకు వెళ్లే పిల్లలు ఉన్నారు,బిజినెస్ చేసుకొని భోజనానికి వెళ్ళటానికి, వారు వాహనాలు అడ్డుగా ఉండటంవల్ల, పక్క గల్లీలు తిరిగి రావాల్సి వస్తుంది. ఇలాంటి రద్దీ బజారు గురించి అధికారులు పట్టించుకోని ఆ గల్లీ ఎదుట వాహనాలు నిలపకుండా చేయాలని ఆ వీధి ప్రజలు కోరుతున్నామని తెలియజేశారు.
Comment List