పోలేపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

పోలేపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21:

Ad
పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి గ్రామంలో ఆదివారం రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గ్రామంలోని కుంటలో ఉన్న దివంగత మహానేత డాక్టర్ వై.యస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలవేసినివాళులర్పించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ బుసిరెడ్డి సాగర్ రెడ్డి మాట్లాడుతూ...తమ ప్రియతమ నేత జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం ఒక పండుగ వాతావరణాన్ని నెలకొల్పిందని,  పేద,బడుగు బలహీన వర్గాలకు, కనీస అవసరాలైన విద్యా,వైద్యం, సంక్షేమ పథకాలు,అందించడంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా అమలు చేసిన ఘనత ఆయనకే దక్కుతుందని కొనియాడారు.ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పాల్వాయి అంజిరెడ్డి,వైసీపీ సీనియర్ నాయకులు గౌరెడ్డి వెంకట్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ పోశం సాంబయ్య, యువ నాయకులు సగిలి శ్రీకాంత్ రెడ్డి, దేశం సీతారెడ్డి,వై.యస్.ఆర్.సి.పి నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు.

 

Tags:
Views: 24