మాచర్ల లో ఘనంగా జరిగిన 11వ బ్లాక్ ఎంపీపీ స్కూల్ ఆధునీకరణ పునః ప్రారంభ వేడుకలు

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే సీఎం చంద్రబాబు లక్ష్యంః ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి 

మాచర్ల లో ఘనంగా జరిగిన 11వ బ్లాక్ ఎంపీపీ స్కూల్ ఆధునీకరణ పునః ప్రారంభ వేడుకలు

ఐఎన్ టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్12:రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే చంద్రబాబు లక్ష్యమని మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి అన్నారు. శుక్రవారం పట్టణంలోని 30వ వార్డులో ఉన్న 11వ బ్లాక్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆధునికరణ పునః ప్రారంభ వేడుకలకు ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు అన్ని సౌకర్యాలతో కూడిన వసతులు అందుతున్నాయని అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు, నాణ్యతతో కూడిన మధ్యాహ్న భోజనం,దుస్తులు, బ్యాగులు అదేవిధంగా తల్లికి వందనం పేరుతో ప్రతి ఒక్కరి తల్లుల ఖాతాల్లో రూ 15,000 లు జమ చేయడం జరుగుతుందన్నారు. శిథిలావస్థలో ఉన్న 11వ బ్లాక్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను బాగు చేసి దేవాలయంగా తీర్చిదిద్దిన హెచ్ఎం కామిరెడ్డి విజయలక్ష్మి పండిట్, కిరీటిరెడ్డిని ఆయన అభినందించారు. ఈ కార్యక్రమం ప్రధానోపాధ్యాయురాలు కామిరెడ్డి విజయలక్ష్మి పండిట్ అధ్యక్షతన ఘనంగా జరిగింది. మూడు నెలల క్రితం ఆ పాఠశాల హెచ్ఎం గా బాధ్యతలు చేపట్టారు. పాఠశాల పూర్వపు పరిస్థితిని చూసి చలించిన ప్రధానోపాధ్యాయురాలు తన కుమార్తె గాదె వేళాంగిణి విజయకీర్తి పేరుతో సుమారు 3 లక్షల రూపాయల పైచిలుకు ఖర్చుపెట్టి పాఠశాలను ఆధునీకరించి టాయిలెట్లునిర్మించి,తరగతి గదులకు,పాఠశాలకు,రంగులు వేయించి, జండా దిమ్మెను నిర్మించి, పాడైపోయిన ఫ్లోరింగ్ ను బాగు చేయించి, మొక్కలు నాటించి నూతన దేవాలయంగా తీర్చిదిద్దారు.ఈ కార్యక్రమం మదర్ తెరిసా సేవా సంస్థ అధ్యక్షులు గాదె కిరీట్ రెడ్డి స్వయంగా గత మూడు నెలల నుండి పర్యవేక్షిస్తూ ఈ పనులను పూర్తి చేశారు.శుక్రవారం జరిగిన పునః ప్రారంభ వేడుకలకు ముఖ్యఅతిథిగా మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రముఖ కంటి వైద్య నిపుణులు డాక్టర్ ఏ. రామలింగారెడ్డి, డాక్టర్ గుర్రం రాజశేఖర్ రెడ్డి, ఎంఈఓ లు డి. జ్యోతి, అల్లి సురేష్, ఆర్సిఎం చర్చి ఫాదర్ జె. బాలస్వామి, సీనియర్ జర్నలిస్ట్ మాగులూరి రాంబాబు, 30,31 వ వార్డు టిడిపి ఇన్చార్జీలు మాచర్ల బాబు, కంభంపాటి దానం బాబు, లయన్స్ క్లబ్ పూర్వపు అధ్యక్షులు బచ్చు సుబ్బారావు, కూనిశెట్టి వెంకటేశ్వర్లు, హెచ్ఎంలు కంభంపాడు మాచర్ల జిల్లా పరిషత్ హై స్కూల్ హెచ్ఎంలు విజయ కుమారి, ఉషారాణి, విశ్రాంత ఉపాధ్యాయులు ముత్యాల పాపిరెడ్డి, అందుగుల చంద్రయ్య, పల్చూరి నరసింహారావు, రామకృష్ణ సేవాసమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి,పలు పాఠశాలల ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా విద్యార్థులు అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. విద్యార్థులకు సాంస్కృతిక కార్యక్రమాలను నేర్పించిన ఉపాధ్యాయినీలు భవాని, మాధవి, రజినీకాంతం, చరిత లను అభినందించారు.

Tags:
Views: 8

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం