సారా బట్టిపై దాడి చేసిన గోకవరం పోలీసులు.

50 లీటర్ల నాటు సారా పట్టివేత, 400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం...

సారా బట్టిపై దాడి చేసిన గోకవరం పోలీసులు.

ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, నవంబర్ 22:గోకవరం మండలం తిరుమలయపాలెం గ్రామ శివారు, కాలువ గట్టుపై సారా కాస్తున్నారన్న సమాచారంతో గోకవరం పోలీసులు సారా బట్టిపై దాడి చేశారు. ఈ దాడిలో సారా కాస్తున్న, అదే గ్రామానికి చెందిన బోయిడి వీరబాబు అనే వ్యక్తిని అరెస్టు చేసి, అతడి నుండి 50 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని, 400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు గోకవరం ఎస్.ఐ. వి.ఎన్.వి. పవన్ కుమార్ తెలిపారు. అనంతరం ఆ వ్యక్తిని రిమాండ్ నిమిత్తం 1వ అదనపు జుడీష్యల్ మెజిస్ట్రేట్, రాజమహేంద్రవరం  ముందు హాజరుపరిచగా 14 రోజులు రిమాండ్ విధించినల్టు ఆయన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలం ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు తావులేదని, ఎవరైనా అటువంటి కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు చేసుకుంటామని ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.

Tags:
Views: 13