ఓఆర్ఆర్ పరిధిలో భూములు కోల్పోయే రైతులు డిమాండ్
ఐ ఎన్ బి టైమ్స్ కంచికచర్ల ఫిబ్రవరి 8:మండలంలోనిఔటర్ రింగ్ రోడ్డు కింద భూములు కోల్పోయే రైతులకు బహిరంగ మార్కెట్ విలువ ప్రకారం నష్టం పరిహారం చెల్లించాలని ఓఆర్ఆర్ పరిధిలో భూములు కోల్పోయే రైతులు డిమాండ్ చేశారు.
మండలంలోని కంచికచర్ల ఓసీ క్లబ్ లో ఓఆర్ఆర్ కింద భూములు కోల్పోతున్న రైతుల సమావేశము ఆదివారం సాయంత్రం జరిగింది.
ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ
ఔటర్ రింగ్ రోడ్ మొదట 140 మీటర్ల వెడల్పుతో ప్రతిపాదించారని, ప్రస్తుత గెజిట్ నోటిఫికేషన్ ప్రకారం వెడల్పు 250 మీటర్లకు పెంచటం రైతులను ఆందోళన గురిచేస్తుందన్నారు. బఫర్ జోన్ పేరిట మరో 500 మీటర్లు ఉంటుందని ప్రచారంలో ఉందని, ఇది రైతులను మరింత వేదనకు గురి చేస్తున్నదన్నారు. దీని ఫలితంగా రైతుల వ్యవసాయ భూమిలో ఎక్కువ విస్తీర్ణం సేకరింరిస్తున్నారన్నారు. 250 మీటర్ల వెడల్పుతో సేకరణ అనేది మితిమీరిన ఏకపక్షం నిర్ణయం అని, ప్రభుత్వం మొట్టమొదటి చెప్పిన దానికి వాస్తవ అవసరానికి చాలా మించిపోయి భూమి సేకరణ చేస్తున్నారన్నారు. ఓ ఆర్ ఆర్ వెడల్పు పెంపుదల అవసరం ,సాంకేత,సాధ్యాసాధ్య అధ్యయనం పరిశీలించి 70 మీటర్ల కు కుదించాలని రైతులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. సెక్షన్ 26(1) భూసేకరణ ప్రతిపాదించిన సంవత్సరం నుండి మూడు సంవత్సరాల పాటు సమాన పరిసర ప్రాంతాల్లో 3 సంవత్సరాల అమ్మకాలు కొనుగోలు ఏది ఎక్కువ ధరకు అమ్ముడుపోయి ఉంటే దాని ఆధారంగా 4 రెట్లు అధికంగా ఇవ్వాలని చట్టం చెబుతుందని, రైతు సంఘాలు 10 రెట్లు డిమాండ్ చేస్తున్నారన్నారు. బహిరంగ మార్కెట్లో భూముల యొక్క విలువ అధికంగా ఉన్నదని, సమీపంలోని రియల్ ఎస్టేట్ భూముల విలువ ప్రకారం పరిగణలోకి తీసుకోవాలనీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. రాజధాని ప్రాంతంలో తమ భూములు ఉన్నందున, ఓ ఆర్ ఆర్ పరిధిలో భూములను కమర్షియల్ ఏరియాగా గుర్తించి నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. రిజిస్ట్రార్ విలువ భూమి యొక్క మార్కెట్ విలువ మధ్య చాలా వ్యత్యాసం ఉన్నందున బహిరంగ మార్కెట్ విలువ పరిగణలోకి తీసుకోని నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలోఆంధ్రప్రదేశ్ రైతు జిల్లా కార్యదర్శి పగడాల వీరాంజనేయులు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కోట కళ్యాణ్, గోపి నాయక్, రైతులు గంగిరెడ్డి రంగారావు, అల్లాడి కోటేశ్వరరావు, నన్నపనేని భాస్కరరావు మల్లెల సుబ్బారావు, కాపా శ్రీనివాసరావు, సాయిరాం, పూర్ణ, జ్ఞాన రెడ్డి, శ్రీనివాసరెడ్డి భోజడ్ల శ్రీనివాసరావు, బండి.కోటేశ్వరావు, బుడ్డి హరికృష్ణ, బుడ్డి రామకృష్ణ, బుడ్డి నరేంద్ర, బొమ్మిశెట్టి మోహనరావు, నన్నపనేని లక్ష్మీ నరసింహరావు, చవళం హరికృష్ణ, కపిలవాయి సుబ్బారావు, మంగళపూడి ప్రసాద్, గొర్రెపాటి మారేశ్వరావు, వివిధ గ్రామాల రైతులు పాల్గొన్నారు.




Comment List