మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి – సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్’ కు విశేష స్పందన లభించింది. స్థానిక గౌడ కాలనీ అర్బన్ హెల్త్సెంటర్‌లో నిర్వహించిన, ఈ శిబిరంలో డాక్టర్ బృంగ లక్ష్మీ ప్రసన్న వైద్య సేవలు అందించారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పీవిఎన్ మాధవ్ ఆదేశాలు మేరకు, జిల్లా అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ సూచనలతో ఈ కార్యక్రమానికి పట్టణ బిజెపి అధ్యక్షుడు ఓర్సు క్రాంతికుమార్ అధ్యక్షత వహించగా, పల్నాడు జిల్లా బిజెపి కార్యదర్శి కవలకుంట జాన్ బాబు మాట్లాడుతూ,“ప్రధాని మోదీ పేదల ఆరోగ్య సంక్షేమం కోసం పలు పథకాలు ప్రవేశపెట్టారు. ముఖ్యంగా ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రతి కుటుంబానికి 5 నుండి 10 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా ఉజ్వల యోజన కింద దేశవ్యాప్తంగా కోట్లాది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్లు కల్పించారు” అని తెలిపారు.నియోజకవర్గ నాయకులు పోకూరి కాశీపతి, బొగ్గవరపు మస్తాన్రావు మాట్లాడుతూ,“జన్ ధన్ యోజన కింద ప్రతి మహిళకు ఉచిత బ్యాంకు ఖాతాలు అందించడం ద్వారా వారిని ఆర్థికంగా శక్తివంతం చేశారు. ఇటీవల నిర్వహించిన సింధూర్ ఆపరేషన్ కార్యక్రమంలో మహిళ అధికారులను నియమించడం ద్వారా మహిళా శక్తి పట్ల ప్రధాని సంకల్పాన్ని మరోసారి చూపించారు” అని గుర్తు చేశారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఏచూరి సురేష్, ఉపాధ్యక్షుడు మారం వంశీ, సజ్జన్, శ్రీనివాసరాజు తదితరులు పాల్గొన్నారు.
Comment List