సబ్బండ వర్గాల అభ్యున్నతే చంద్రబాబు ధ్యేయం
దీర్ఘకాలిక ప్రభుత్వాలతోనే అభివృద్ధి -స్మార్ట్ రేషన్ కార్డులతో పారదర్శక పంపిణీ: మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి*
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 15:సబ్బండ వర్గాల అభ్యున్నతే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమని మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి పునర్ఘాటించారు. సోమవారం స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో, నియోజకవర్గ స్థాయి నూతన స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. నియోజకవర్గ పరిధిలో ఉన్న దాదాపు 98 వేల 351 స్మార్ట్ కార్డులను ఆయన ప్రారంభించి, కార్యక్రమానికి విచ్చేసిన కొంతమంది లబ్ధిదారులకు ఆయన చేతులు మీదిగా అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రేషన్ కార్డుతో అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఆధారపడి ఉన్నాయని, కూటమి ప్రభుత్వం ఏర్పడిన అనతికాలంలోనే నియోజకవర్గ పరిధిలో దాదాపు 12 వేల రేషన్ కార్డులను అందజేసినట్లు వివరించారు. ప్రభుత్వం అదిస్తున్న స్మార్ట్ కార్డులతో రాష్ట్రంలో ఎక్కడైన రేషన్,ఇతర సరుకులను తీసుకొవచ్చని పేర్కొన్నారు. దీర్ఘకాలిక ప్రభుత్వంతోనే అభివృద్ధి..!రాష్ట్రంలో దీర్ఘకాలిక ప్రభుత్వంతోనే మెరుగైన అభివృద్ధిని సాధించవచ్చునని, ఎమ్మెల్యే జూలకంటి అభిప్రాయ వ్యక్తం చేశారు. మాచర్ల నియోజకవర్గం అభివృద్ధికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం పెద్దపేట వేస్తుందని స్పష్టం చేశారు. జల జీవన్ మిషన్ ద్వారా రూ. 800 కోట్లతో నియోజకవర్గంలోని ఐదు మండలాలకు తాగునీరు, అమృత స్కీం ద్వారా రూ. 140 కోట్లతో మాచర్ల పట్టణంలో తాగునీరు అందించే బృహత్తర కార్యక్రమాలకు త్వరలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శ్రీకారం చుడతారని ఆయన వెల్లడించారు. అలానే అతిత్వరలో వరికపూడిశెల ప్రాజెక్ట్ నిర్మాణానికి శంకుస్థాపనకు ముహూర్తం ఖరారు అవుతుందని ఆయన తెలిపారు. అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున అమలు కావడం ఎమ్మెల్యేగా గర్వపడుతున్నానని.., ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తాను జీవితాంతం రుణపడి ఉంటానని హర్షం వ్యక్తం చేశారు.

క్యూఆర్ కోడ్ తో ప్రభుత్వ అందిస్తున్న స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో ఎంతో పారదర్శకతను తీసుకురావచ్చని ఎమ్మెల్యే జూలకంటి అభిప్రాయపడ్డారు. ప్రజలకు సకాలంలో రేషన్, ఇతర సరుకులను అందజేస్తూ, ప్రభుత్వానికి డీలర్లు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో మురళీ, ఐదు మండలాల తహసీల్దార్లు కిరణ్ కుమార్, వెంకటేశ్వర నాయక్, కరుణ కుమార్, రాజశేఖర్, కనకం మేరి, మున్సిపల్ కమిషనర్ వేణుబాబు, మార్కెట్ యార్డు చైర్మన్ రాజబోయిన మధు, మున్సిపల్ మాజీ చైర్మన్ పోలూరి నరసింహారావు, వడ్డెర కార్పోరేషన్ డైరెక్టర్ కొమెర దుర్గారావు తదితరులు పాల్గొన్నారు.
Comment List