అకుంఠిత దీక్షతో వరికపూడిసెలను పూర్తి చేస్తారు

అకుంఠిత దీక్షతో వరికపూడిసెలను పూర్తి చేస్తారు

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 03 :అకుంఠిత దీక్షతో వరికపూడిసెలను మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానంద రెడ్డి నేతృత్వంలో పూర్తి అవుతుందని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు  జూలకంటి అక్కిరెడ్డి , గౌతమ్ రెడ్డిలు ఉద్ఘాటించారు. గురువారం మాచర్ల పట్టణం, మండాది రోడ్ లోని  శ్రీ రామకృష్ణ సేవా సమితి వారి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద సేవాశ్రమం నందు పదవ తరగతి పూర్తయిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన  ఉచిత కోచింగ్ సెంటర్ ను వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ .. సామాజిక సేవా కార్యక్రమాలకు పూర్తిగా సహకరిస్తామని, నియోజకవర్గ అభివృద్ధి, సంక్షేమమే ఎమ్మెల్యే జూలకంటి ప్రధాన లక్ష్యమని వారు వెల్లడించారు. పదో తరగతి పూర్తయిన విద్యార్థులందరూ పాలిటెక్నిక్, ఏపీఆర్జేసీ, స్పోకెన్ ఇంగ్లీష్ లకు సంబంధించిన ఈ ఉచిత శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. విద్యార్థుల కోసం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న శ్రీ రామకృష్ణ సేవా సమితికి ఈ సందర్భంగా ఆర్థిక సహాయం ప్రకటించారు.అనంతరం  గౌతమ్ రెడ్డి, అక్కిరెడ్డిలను శ్రీరామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి  ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివేకానంద ఆశ్రమ సిబ్బంది,తెలుగుదేశం పార్టీ మాచర్ల పట్టణ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:
Views: 2

Advertisement

Latest News

కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం.. కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం..
ఐ న్ బి టైమ్స్ కోరుకొండ మే 14:రేపు కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం...వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే రైతన్నలకు........
శిరిగిరిపాడు లో  పోలీసుల కార్డన్ సెర్చ్..
శ్రీ రామకృష్ణ సేవాసమితి లో స్పోకెన్ ఇంగ్లీష్, నైతిక ఆధ్యాత్మిక విలువల క్లాసులు
నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి..!
వరదయ్యపాలెంలో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు
నిరంతర శ్రామీకుడు చంద్రబాబు
రక్తపాతం ఇంకెంతకాలం పిన్నెల్లి..?