పంచాయతీ రాజ్ వ్యవస్థ బలంగా ఉండాలంటే, జిల్లా పరిషత్తులు పరిపుష్టిగా ఉండాలి…..!
16 వ ఆర్ధిక సంఘం సమావేశంలో సత్యవేడు జెడ్పీటీసి
ఐ ఎన్ బి టైమ్స్ తిరుపతి ఏప్రిల్ 17:తిరుపతి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో 16 వ ఆర్ధిక సంఘం చైర్మన్ డాక్టర్. అరవింద్ పనగారియా అధ్యక్షతన నిర్వహించిన 16 వ ఆర్ధిక సంఘ సమావేశానికి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జిల్లా పరిషత్ సభ్యుల తరఫున సత్యవేడు జెడ్పీటీసి ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాలు,పంచాయతీరాజ్ సంస్థలు అభివృద్ధి సాధించాలంటే జిల్లా పరిషత్తులు బలంగా ఉండాలని 16వ ఆర్ధిక సంఘం చైర్మన్ డా. అరవింద్ పనగారియను కోరారు, అలాగే జిల్లా పరిషత్తులకు స్వయం సమృద్ధి నిధులు సమకూరేవిధంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకరించాలని రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రధాన కార్యదర్శి శశిభూషణ్ కుమార్, రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ కృష్ణతేజాను ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర జిల్లా పరిషత్తుల తరఫున సత్యవేడు జడ్పీటీసి సభ్యులు విజయలక్ష్మీ చంద్రశేఖర్ రెడ్డి విన్నవించారు. ఈ ప్రతిపాదనకు 16వ ఆర్ధిక సంఘం సభ్యులు అన్నీజార్‌జ్ మాద్యూ,అజయ్ నారాయణ్ జాహులు మద్దతు పలికి అభినందించారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్లు, జాయింట్ కలెక్టర్ సుభాం భంసాల్, ఉమ్మడి చిత్తూరు జిల్లా సిఇఓ రవికుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Comment List