మాచర్లలో ఘనంగా భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 06:భారతీయ జనతా పార్టీ నలభై ఐదవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. మాచర్ల టౌన్ లోని పార్క్ సెంటర్లో బిజెపి పార్టీ జెండాను పట్టణ అధ్యక్షుడు ఓర్సు క్రాంతికుమార్ ఎగురవేశారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు బొగ్గవరపు మస్తాన్ రావు,కూనిశెట్టి వెంకటేశ్వర్లు,పోకూరి కాశీపతి మాట్లాడుతూ భారతదేశ జిడిపి ని ప్రధాని మోడీ నేతృత్వంలో రెండింతలు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. కాంగ్రెస్ గత ఆరు దశాబ్దాల్లో సాధించిన దాన్ని బిజెపి ఒక్క దశాబ్దంలోని డబల్ చేసిందని పేర్కొన్నారు. భారతీయ జనతా పార్టీలో ప్రతి కార్యకర్తకు దేశంపై భక్తి ఉందన్నారు. ఎన్నో దశాబ్దాలుగా పట్టిపీడుతున్న చట్టాలను తొలగించిన ఘనత బిజెపికి దక్కుతుందన్నారు.ఆర్టికల్ 370, త్రిబుల్ తలాక్ తదితర బిల్లులను రద్దు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రధాని మోడీ బలమైన సంస్కరణలను చేపడుతూ భారతదేశాన్ని ప్రపంచంలో మంచి గుర్తింపు తెచ్చారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆవిర్భావ దినోత్సవ ఇంచార్జ్ శెట్టి హనుమంతరావు, ఏచూరి సురేష్, ఆలేటి సామ్యూల్, మారం వంశీకృష్ణ,లాక పేరయ్య యాదవ్, బొడ్డుపల్లి ఈశ్వరయ్య, గోపవరపు చెన్నకేశవరావు,అన్నవరపు ఏడుకొండలు, శివ కోటయ్య నాయక్, చల్ల శిరీష, చల్ల రమణ, మాచర్ల ఇందిరా, ప్రసన్న, భగత్ సింగ్ నాయక్, గోపవరపు నీరజ్, తాటిశెట్టి సాంబశివరావు, శ్రీనివాసరాజు, వెల్దుర్తి మండల అధ్యక్షుడు పిట్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
Comment List