వరదయ్యపాలెంలో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు
ఐ ఎన్ బి టైమ్స్ వరదయ్యపాలెం ఏప్రిల్ 20:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా ఆదివారం వరదయ్యపాలెం బస్టాండ్ ఆవరణంలో మండల అధ్యక్షులు యుగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో శ్రీ సిద్దలయ్య స్వామి గుడిలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని పూజలు జరిపించారు. తదుపరి వరదయ్య పాలెం బస్టాండ్ వద్ద టీడీపీ నాయకులు చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.అనంతరం కేక్ కట్ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వరదయపాలెం మండల అధ్యక్షులు యుగందర్ రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ కూటమి ప్రభుత్వం మేనిఫెస్టో లో పొందుపరిచిన పథకాలన్నీ చంద్రన్న ఒక్కొక్కటిగా అమలు పరచుకుంటూ వస్తున్నారని అదేవిధంగా యువతకు ఉపాధి కలిగించే విధంగా మెగా డీఎస్సీ విడుదల చేస్తున్నందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు చంద్రబాబు అభిమానులు పాల్గొన్నారు.
Comment List