అలుపెరగని అభివృద్ధి ప్రదాత చంద్రబాబు-విధ్వంసం నుంచి ఉన్నతి వైపు  ఏపీ పరుగులు

చంద్రబాబు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి.

అలుపెరగని అభివృద్ధి ప్రదాత చంద్రబాబు-విధ్వంసం నుంచి ఉన్నతి వైపు  ఏపీ పరుగులు

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 20 :ఆంధ్రప్రదేశ్ ఉన్నతకి నిరంతర శ్రామికుడు, అభివృద్ధి విషయంలో   అలుపెరుగని కృషీవలుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఉద్ఘాటించారు. ఆదివారం  స్థానిక వడ్డే ఓబన్న సెంటర్ లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఆధ్వర్యంలో సీఎం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే జూలకంటి, భారీ కేకును కట్ చేసి, టిడిపి అధినేత చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కార్మిక, కర్షక, పారిశ్రామిక రంగాల వారికి మంచి పరిపాలకుడు చంద్రబాబు అని ఆయన కొనియాడారు. 18 గంటలు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసమే ఆలోచించే నిరంతర శ్రామికుడు, తెలుగుదేశం పార్టీ ఆరాధ్య దైవం చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు  పార్టీ నాయకుల సమక్షంలో జరుపుకోవడం ఎంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు.

Ad
విధ్వంసం నుంచి ఉన్నత వైపు..!

జగన్ రెడ్డి సృష్టించిన విధ్వంసం నుంచి..,  ఉన్నతి వైపు ఆంధ్రప్రదేశ్ ను చంద్రబాబు పరుగులు పెట్టిస్తున్నారని ఎమ్మెల్యే జూలకంటి పేర్కొన్నారు.  అప్పుల సుడిగుండంలో రాష్ట్రాన్ని జగన్ రెడ్డి వదిలేసి వెళ్తే.., అన్ని రంగాలను  వృద్ధి వైపు పయనించేలా చంద్రబాబు శ్రమిస్తున్నారని గుర్తు చేశారు. వైసిపి పాలనలో ఐదేళ్ల కాలంలో ఒక్క డీఎస్సీ ఇవ్వకపోగా..., జాబ్ క్యాలెండర్ ఇస్తానని  నిరుద్యోగ యువతను నిండా ముంచారని విమర్శించారు. తండ్రి శవం పై పునాదులు వేసుకున్న పార్టీ.. వైసీపీ అని.., శవానందం తప్ప  వేరొకటి జగన్ రెడ్డికి తెలియదని  ఎద్దేవా చేశారు.

 పిచ్చి వేషాలేస్తే తాట తీస్తాం పిన్నెల్లి..! 

ఆశయాలకు, అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను కాబట్టే మీ  నీచ రాజకీయాలు నియోజకవర్గంలో ఇంకా చెలామణి అవుతుందని, పిచ్చిపిచ్చి వేషాలేస్తే తాటతీస్తామని పిన్నెల్లికి ఎమ్మెల్యే జూలకంటి మాస్ వార్నింగ్ ఇచ్చారు. మాచర్ల నియోజకవర్గాన్ని అన్నదమ్ములు వాటాలు వేసుకొని మరి దోచుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  జైలు పక్షి పిన్నెల్లికి మీరు కూడా తోడు వెళ్లాలంటే.., చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొచ్చు అని వైసిపి నాయకులను హెచ్చరించారు.

సీఎం చంద్రబాబు జన్మదిన వేడుకల్లో మాచర్ల పట్టణ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బిజెపి, జనసేన నేతలు పాల్గొన్నారు.

Tags:
Views: 11

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

చిరుమామిళ్ళ మధుబాబు కి హార్దిక శుభాకాంక్షలు:కటికల బాలకృష్ణ చిరుమామిళ్ళ మధుబాబు కి హార్దిక శుభాకాంక్షలు:కటికల బాలకృష్ణ
ఐ ఎన్ బి టైమ్స్ కారంపూడి ప్రతినిధి నవంబర్ 22:మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు చిరుమామిళ్ల మధుబాబు కు "పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ...
ఆధార్ కార్డు లేని చిన్నారులకు ఆధార్ కార్డ్స్ తీయించుచున్న మెట్టు గోవిందరెడ్డి
సారా బట్టిపై దాడి చేసిన గోకవరం పోలీసులు.
పౌరుషాలకు వీర తిలకం దిద్దిన కోడిపోరు ఘట్టం - రక్తికట్టిన చిట్టిమల్లు, సివంగి ల పోరాటం..!
కోడిపోరు ఉత్సవానికి విచ్చేసిన అతిథులు -నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు
ఉపాధి హామీ పనులపై గ్రామసభ...
నాటు కోళ్లు దొంగలను పట్టుకున్న గోకవరం పోలీసులు...