వెల్దుర్తిలో ఘనంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు.
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి ఏప్రిల్: 20దార్శనికుడు, ఆంధ్రప్రదేశ్ కు ఆదర్శప్రాయుడు, తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జన్మదిన వేడుకలు వెల్దుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ కేకును మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానంద రెడ్డి కట్ చేసి, చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్ద ఎత్తున తరలివచ్చిన నాయకులకు, కార్యకర్తలకు కేకును అందజేసి, వేడుకలు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో వెల్దుర్తి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
Views: 3
About The Author
Post Comment
Latest News
14 May 2025 18:04:50
ఐ న్ బి టైమ్స్ కోరుకొండ మే 14:రేపు కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం...వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే రైతన్నలకు........
Comment List