చంద్రగిరి మండలం కొటాల పంచాయతీలో పులివర్తి సుధా రెడ్డి పర్యటన
పులివర్తి సుధా రెడ్డికి ఘన స్వాగతం పలికిన మహిళలు, నాయకులు, కార్యకర్తలు
ఐ ఎన్ బి టైమ్స్ చంద్రగిరి ఏప్రిల్ 17:చంద్రగిరి మండలం కొటాల పంచాయితీ కి విచ్చేసిన పులివర్తి సుధా రెడ్డికి మహిళలు ఘన స్వాగతం పలికారు.మహిళలను ఆప్యాయంగా పలకరిస్తూ ముందుకు సాగారు. కొటాల పంచాయతీలో చేసిన పలు అభివృద్ధి పనులను మహిళలకు తెలిపుతూ పార్టీలకు అతీతంగా మహిళలందరికి ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకోవాలి అని పిలుపునిచ్చారు.యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉచిత టైలరింగ్ శిక్షణ, స్వయం ఉపాధి శిక్షణ ద్వారా మహిళలకు ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అని తెలిపారు.రేషన్ కార్డు, పెన్షన్, ఇంటి స్థలాలు వంటి సమస్యలకు సచివాలయంలో దరఖాస్తులు ఇవ్వాలని మహిళలను సూచించారు.మీరు ఇచ్చే ప్రతి సమస్యకు పరిష్కారమే లక్ష్యంగా ముందుకు వెళ్తామని మహిళలను ప్రోత్సాహించారు. కూటమి ప్రభుత్వం మాటల ప్రభుత్వం కాదు.చేతల ప్రభుత్వం అని పార్టీలకు అతీతంగా చంద్రగిరి నియోజవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నామని అన్నారు. తన పర్యటన ముగింపులో మహిళల నుండి అర్జీలు స్వీకరించారు.ఈ కార్యక్రమంలో కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొన్నారు.
Comment List