16వ ఆర్ధిక సంఘ కమిషన్ చైర్మన్ అరవింద్ కు TICCI నీవేదిక..

ఐ న్ బి టైమ్స్ తిరుపతి 18 ఏప్రిల్ :16వ ఆర్థిక సంఘం కమీషన్ ఛైర్మెన్ అరవింద్ పనగడియా కు  ట్రైబల్ ఇండియన్ ఛాంబర్ ఆఫ్ కామర్స & ఇండస్ట్రీ  (టి క్కీ) (TICCI) సమర్పించిన నివేదిక లోని కొన్ని ప్రధాన అంశాలు.16వ  ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ అరవింద్ పనగడియా, కమిటీ సభ్యులతో తిరుపతి కలెక్టరేట్ లో గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో ఎస్టీ పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని      టిక్కీ ఆంధ్రప్రదేశ్ చాప్టర్ ప్రధాన కార్యదర్శి M.రామ్మూర్తి నాయక్ కోరారు. పారిశ్రామికంగా గిరిజన లను ప్రోత్సహించడానికి అనేక అంశాలతో కూడిన ప్రతిపాదనలు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. ముఖ్యంగా ఐదు ప్రధాన అంశాలపై కమిషన్ చైర్మన్ తో  చర్చించారు. మొదటి తరం పారిశ్రామిక వేత్తలకు, ఔత్సాహిక వ్యాపార, నిరుద్యోగ యువతను ప్రోత్సహించడానికి చర్యలు తీసుకోవాలని నివేదికలో కోరారు

◆ STవర్గాలకు క్రెడిట్ లింక్డ్ ఇన్వెస్టమెంట్ సబ్సిడీ 25% నుండి 45% పెంచాలి.
◆ రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న వెనుకబడిన జిల్లాలకు  ప్రత్యేక గ్రాంటు ఇస్తున్న తరహాలోనే sc st వర్గాలకు ప్రత్యేక పారిశ్రామికి రాయితీలు ఇవ్వాలని.,
◆ STవర్గాలకు ప్రత్యేకంగా Entrepreneurship, స్కిల్ డేవలప్మెంట్ లో నింష్ణాతులను చేయడానికి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేయాలి.
◆ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రోక్యూర్మెంట్ పాలసీ లో st వర్గాలకు 5% రిజర్వు ఉంది. దాన్ని సక్రమంగా అమలు చేయాలని
◆ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్రెడిట్ గ్యారెంటీ పథకాన్ని అమలు చేయడంలో వాణిజ్య బ్యాంకులు నిరాదరణ చూపుతున్నాయి. దాన్ని సక్రమంగా అమలు జరిపించి మొదటి తరం దళిత పారిశ్రామిక వేత్తలకు ఆర్థిక భరోసా కల్పించి వికసిత భారత్ లో సుస్థిర స్థానం కల్పించాలని ఆయన డిమాండు చేశారు.అలాగే మైదానం ప్రాంతం  గిరిజన లకు ప్రోత్సాహం గా ప్రత్యేక మైన Tribal ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పార్క్ TIDP ను ఏర్పాటు చేయవలసిన అవశ్యకతను వారి దృష్టిలో ఉంచారు.

Tags:
Views: 16

Advertisement

Latest News

కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం.. కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం..
ఐ న్ బి టైమ్స్ కోరుకొండ మే 14:రేపు కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం...వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే రైతన్నలకు........
శిరిగిరిపాడు లో  పోలీసుల కార్డన్ సెర్చ్..
శ్రీ రామకృష్ణ సేవాసమితి లో స్పోకెన్ ఇంగ్లీష్, నైతిక ఆధ్యాత్మిక విలువల క్లాసులు
నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి..!
వరదయ్యపాలెంలో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు
నిరంతర శ్రామీకుడు చంద్రబాబు
రక్తపాతం ఇంకెంతకాలం పిన్నెల్లి..?