నిరంతర శ్రామీకుడు చంద్రబాబు
విజయపురి సౌత్ లో ఘనంగా జన్మదిన వేడుకలు.
ఐ ఎన్ బి టైమ్స్ విజయపురి సౌత్ ప్రతినిధి ఏప్రిల్ 20 :ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిరంతరం పాటుపడుతున్నారని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి అన్నారు. ఆదివారం మాచర్ల రూరల్ మండలం, విజయపురి సౌత్ లో చంద్రబాబు జన్మదిన వేడుకలను పార్టీ శ్రేణులు అట్టహాసం జరుపుకున్నారు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే జూలకంటి హాజరై, కార్యకర్తలతో కలిసి చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం భారీ కేక్ ను కట్ చేసి.., శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ .. గత 15 సంవత్సరాలుగా ఎన్నడూ చూడని అభివృద్ధిని నేడు నియోజకవర్గ ప్రజలు చూస్తున్నారని ఆయన వివరించారు. విజయపూరి సౌత్ ను అన్నీ విధాలుగా అభివృద్ధి చేసి.., ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. చంద్రబాబు పరిపాలన దక్షుడని,అందుకే మాచర్లకు పెద్దఎత్తున నిధులు కేటాయించి.., అభివృద్ధిని పరుగులు పెట్టిస్తున్నారని వివరించారు. అనంతరం వేడుకల్లో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలకు అల్పాహారం అందించారు. ఈ వేడుకల్లో మాచర్ల రూరల్ మండలం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Comment List