అంగరంగ వైభవంగా వెల్దుర్తి రామయ్య కళ్యాణం.

అంగరంగ వైభవంగా వెల్దుర్తి రామయ్య కళ్యాణం.

 ఐ ఎన్ బి టైమ్స్ వెల్దుర్తి ప్రతినిధి ఏప్రిల్ 06:పవిత్ర శ్రీరామ నవమి పర్వదినాన్ని పురష్కరించుకుని ఆదివారం స్థానిక శ్రీ కోదండ రామాలయంలో సీతా రామ స్వామి వార్ల కళ్యాణమహోత్సవం కన్నుల పండువగా జరిగింది. ఈ ఉత్సవాల్లో మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి, సతీమణి శోభరాణి పాల్గొని స్వామి వారి కళ్యాణాన్ని వైభవోపేతంగా నిర్వహించారు. ముందుగా ఎమ్మెల్యే జూలకంటి ఇంటి నుంచి స్వామి వారికి కళ్యాణ  పట్టు వస్త్రాలను తీసుకుని, పురవీధుల్లో ఊరేగింపుగా ఆలయం వద్దకు బయలుదేరారు. ఆలయంలో వేంచేసియున్న శ్రీ సీతా సమేత శ్రీ రామచంద్రమూర్తికి పట్టు వస్త్రాలను సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు.  అనంతరం శ్రీ సీతా రాముల కళ్యాణ మూర్తులను జూలకంటి దంపతులు స్వయంగా  మండపానికి తోడ్కొని వెళ్లి, జగన్నాథుడి కళ్యాణ మహోత్సవాన్ని ఆగమ శాస్త్రోక్తంగా అంగరం వైభవంగా  నిర్వహించారు. అనంతరం స్వామివార్ల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, వెల్దుర్తి మండల తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Tags:
Views: 7

Advertisement

Latest News

కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం.. కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం..
ఐ న్ బి టైమ్స్ కోరుకొండ మే 14:రేపు కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం...వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే రైతన్నలకు........
శిరిగిరిపాడు లో  పోలీసుల కార్డన్ సెర్చ్..
శ్రీ రామకృష్ణ సేవాసమితి లో స్పోకెన్ ఇంగ్లీష్, నైతిక ఆధ్యాత్మిక విలువల క్లాసులు
నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి..!
వరదయ్యపాలెంలో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు
నిరంతర శ్రామీకుడు చంద్రబాబు
రక్తపాతం ఇంకెంతకాలం పిన్నెల్లి..?