నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి..!

నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి..!

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఏప్రిల్ 19:పల్నాడు జిల్లా దుర్గి మండలం లో నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు సందర్భంగా జోల కంటి బ్రహ్మానందరెడ్డి మాట్లాడుతూ జగన్ రెడ్డి చర్యలన్నీ  ఫ్యాబ్లో ఎస్కోబార్ ను  తలపిస్తాయని  మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి విమర్శించారు. ఆదివారం దుర్గి మండల కేంద్రంలో నందమూరి తారక రామారావు విగ్రహం వద్ద  తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ఎమ్మెల్యే జూలకంటి ముఖ్య అతిథిగా పాల్గొని, భారీ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల చేసి, ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..,వ్యవస్థలను గాడిలో పెట్టేందుకు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అహర్నిశలు శ్రమిస్తున్నారని ఆయన అన్నారు. ఐదేళ్లలో  వైసీపీ పాలనలో ఏపీ సర్వనాశనమైందని, అమరావతి, పోలవరం నిర్మాణాలను పడకేసేలా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు పోరు, రైతు పోరు గత వైసిపి ప్రభుత్వం నుంచే పుట్టుకొచ్చాయని  విమర్శించారు. శవరాజకీయం, బురద రాజకీయంలో జగన్ రెడ్డి, వైసీపీ నాయకులు, ఆరితేరారని ఎద్దేవా చేశారు. అధికారం ఉంటే ఆంధ్రప్రదేశ్ లో.., కోల్పోతే బెంగళూరు ప్యాలేస్ లో జగన్ ఉంటారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, బిజెపి, జనసేన నాయకులు పాల్గొన్నారు.,

Tags:
Views: 6

Advertisement

Latest News

కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం.. కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం..
ఐ న్ బి టైమ్స్ కోరుకొండ మే 14:రేపు కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం...వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే రైతన్నలకు........
శిరిగిరిపాడు లో  పోలీసుల కార్డన్ సెర్చ్..
శ్రీ రామకృష్ణ సేవాసమితి లో స్పోకెన్ ఇంగ్లీష్, నైతిక ఆధ్యాత్మిక విలువల క్లాసులు
నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి..!
వరదయ్యపాలెంలో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు
నిరంతర శ్రామీకుడు చంద్రబాబు
రక్తపాతం ఇంకెంతకాలం పిన్నెల్లి..?