రక్తపాతం ఇంకెంతకాలం పిన్నెల్లి..?

జమ్మలమడక ఘటనపై  ఎమ్మెల్యే  జూలకంటి ఆగ్రహం.

రక్తపాతం ఇంకెంతకాలం పిన్నెల్లి..?

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 20 :పచ్చని పల్లెల్లో ఇంకెంతకాలం రక్తపాతం సృష్టిస్తావు పిన్నెల్లి? అని ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ప్రశ్నించారు. శనివారం మాచర్ల ప్రభుత్వాసుపత్రిలో వైసిపి గుండాల దాడిలో గాయపడి, చికిత్స పొందుతున్న జమ్మలమడక గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులను ఆయన పరామర్శించారు. గ్రామాల్లో గత కొంతకాలంగా వైసీపీ మూకలు టీడీపీ నాయకులు, కార్యకర్తలపై కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, అది మంచి పద్ధతి కాదని ఎమ్మెల్యే హెచ్చరించారు.  మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గత ఐదు సంవత్సరాలుగా మాచర్ల నియోజకవర్గంలో సృష్టించిన అరాచకం, దౌర్జన్యం, దాడులు, అవినీతి కేసుల్లో  జీవితాంతం జైల్లో ఉంటారని, ఆయనతోపాటు వైసీపీ నాయకులను, కార్యకర్తలను తోడు తీసుకొని వెళ్లేందుకే  పల్లెల్లో అలజడులను సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే, ఇటువంటి దాడులకు తెగపడుతున్నారని ధ్వజమెత్తారు.  హత్యా రాజకీయాలు చేస్తే సహించేది లేదని పేర్కొన్నారు. దాడులు వెనక ఎంతటి వారు ఉన్నా, చట్టపరంగ శిక్షించబడతారని  బాధిత కుటుంబ సభ్యులకు ఆయన భరోసా ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట మాచర్ల పట్టణ టిడిపి నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.

Tags:
Views: 119

Advertisement

Latest News

కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం.. కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం..
ఐ న్ బి టైమ్స్ కోరుకొండ మే 14:రేపు కోరుకొండలో రైతులకు ప్రోత్సాహక వ్యవసాయ యంత్రాలు, పరికరాలు పంపిణీ కార్యక్రమం...వ్యవసాయ శాఖ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారిచే రైతన్నలకు........
శిరిగిరిపాడు లో  పోలీసుల కార్డన్ సెర్చ్..
శ్రీ రామకృష్ణ సేవాసమితి లో స్పోకెన్ ఇంగ్లీష్, నైతిక ఆధ్యాత్మిక విలువల క్లాసులు
నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకల్లో ఎమ్మెల్యే జూలకంటి..!
వరదయ్యపాలెంలో ఘనంగా సీఎం చంద్రబాబు నాయుడు 75వ పుట్టినరోజు వేడుకలు
నిరంతర శ్రామీకుడు చంద్రబాబు
రక్తపాతం ఇంకెంతకాలం పిన్నెల్లి..?