క్రికెట్ విజేతలకు బహుమతుల ప్రధానం
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఏప్రిల్ 20 :మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి జన్మదినాన్ని పురష్కరించుకుని స్ధానిక SKBR గ్రౌండ్ నందు ఏర్పాటు చేసి రాష్ట్ర స్ధాయి క్రికెట్ టోర్నమెంట్ విజేతలకు ఎమ్మెల్యే జూలకంటి చేతులు మీదిగా శుక్రవారం బహుమతులు ప్రధానం జరిగింది. మొదటి విజేతగా నిలిచిన శ్రీ నిదానంపాటి లక్ష్మీ అమ్మవారి క్రికెట్ టీం, అడిగొప్పల వారికి రూ. 50,116 నగదు పురస్కారం తోపాటు ట్రోఫిని ఎమ్మెల్యే జూలంకటి చేతులు మీదిగా అందుకున్నారు. అలానే రెండో విజేతగా నిలిచిన బీఎస్ఆర్ యూత్, మాచర్ల వారికి రూ. 30,116 నగదు పురస్కారం తోపాటు ట్రోఫి, మూడో విజేతగా డార్క్ నైట్స్, మాచర్ల వారు నిలవగా.. వారికి రూ.20,116 నగదు పురస్కారం తోపాటు ట్రోఫిని ఎమ్మెల్యే అందజేశారు. అలానే ట్రోర్నిలో బీఎస్ఆర్ యూత్ నుంచి మ్యాన్ ఆఫ్ ది సీరియస్ ప్లేయర్ నిలిచిన కృష్ణకు రూ. 3,016 విత్ ట్రోఫి, అడిగొప్పల టీం నుంచి బెస్ట్ బ్యాట్స్ మ్యాన్ గా నలిచిన అశోక్ కు రూ. 2,016, బీఎస్ఆర్ యూత్ నుంచి బెస్ట్ బౌలర్ గా నిలిచిన సైదారావుకు రూ. 2,016 నగదు, విత్ ట్రోఫీలను ఎమ్మెల్యే అందజేశారు. తన జన్మదినాన్ని పురష్కరించుకుని యువతలో క్రీడా స్పూర్తిని నింపేందుకు రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నీని విజయవంతంగా నిర్వహించి.., నగదు బహుమతులను ప్రకటించిన టీడీపీ యూవ నాయకులు గౌతమ్ రెడ్డి, అక్కిరెడ్డి, టీడీపీ నాయకులు దుర్గెంపూడి శశిభూషన్ రెడ్డి, బోయ వెంకటరామిరెడ్డిలను ఈ సందర్భంగా ఎమ్మెల్యే అభినందించారు.
Comment List