శ్రీ రామకృష్ణ సేవాసమితి లో స్పోకెన్ ఇంగ్లీష్, నైతిక ఆధ్యాత్మిక విలువల క్లాసులు
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి మే : 04శ్రీ రామకృష్ణ సేవా సమితి మాచర్ల వారి ఆధ్వర్యంలో శ్రీశైలం రోడ్ లో గల స్వామి వివేకానంద సేవాశ్రమంలో స్వామి వివేకానంద స్ఫూర్తితో శనివారం స్పోకెన్ ఇంగ్లీష్ మరియు నైతిక, ఆధ్యాత్మిక విలువల క్లాసులు ప్రారంభించినట్లు శ్రీ రామకృష్ణ సేవా సమితి అధ్యక్షులు మెట్టు గోవిందరెడ్డి తెలిపారు. ముందుగా మెట్టు గోవిందరెడ్డి ఉపాధ్యాయులు మరియు విద్యార్థుల తల్లిదండ్రులతో కలసి స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు మెట్టు గోవింద రెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద స్ఫూర్తితో విద్యార్థి దశ నుంచే విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లీష్ తో పాటు నైతిక, ఆధ్యాత్మిక విలువలు పెంపొందించాలని సంకల్పంతో ఈ ఉచిత క్లాసులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిరోజు సాయంత్రం 6 గంటల నుండి 7.30 వరకు ఉంటుందని, ఈ ఉచిత శిక్షణ తరగతులను ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని తమ జీవితంలో ఆచరించగలరని ఈ సందర్భంగా గోవింద రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉచిత కోచింగ్ ఇస్తున్నటు విరువంటి శ్రీనివాస్ ,ఈశ్వరరావు మాస్టర్ మరియు విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.
Comment List