అండర్-19 జూనియర్ కళాశాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో విజేత కృష్ణవేణి జూనియర్ కళాశాల టీం వినుకొండ

మాచర్ల నూటన్స్ ఇంజనీరింగ్ కళాశాలలో జరిగిన అండర్-19 క్రికెట్ పోటీలు

అండర్-19 జూనియర్ కళాశాల స్థాయి క్రికెట్ టోర్నమెంట్ లో విజేత కృష్ణవేణి జూనియర్ కళాశాల టీం వినుకొండ

ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి

ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 15:పల్నాడు జిల్లా, మాచర్ల నియోజకవర్గం, మాచర్ల మండలంలోని అలుగురాజుపల్లి గ్రామంలోని న్యూటన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో, గత వారం రోజుల నుంచి జరుగుతున్న అండర్-19 జూనియర్ కళాశాలల క్రికెట్ పోటీలు విజయవంతంగా నిర్వహించడం జరిగిందని నూటన్స్ కళాశాల వారు తెలియజేశారు. కర్నూలు, ప్రకాశం, పల్నాడు, మరియు గుంటూరు జిల్లాలలోని, జూనియర్ కళాశాలల కు సంబంధించిన క్రికెట్ జట్లు పాల్గొనడం జరిగిందని తెలిపారు. ఈ పోటీలలో విజయం సాధించిన జట్లకు మాచర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి ఆదివారం నిర్వహించిన సభలో క్రీడాకారులను ప్రశంసించి బహుమతులు అందజేశారు. ఈ జూనియర్ స్థాయి క్రికెట్ పోటీలలో మొదటి బహుమతిని 25000/- రూ నగదు, మరియు షీల్డ్ ను కృష్ణవేణి జూనియర్ కళాశాల వినుకొండ వారు గెలుపొందడం జరిగిందని తెలిపారు. రెండవ బహుమతి 20000/- రూ నగదు మరియు షీల్డ్ ను ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ అసోసియేషన్ జూనియర్ కళాశాల అచ్చంపేట వారు గెలుపొందగా, మూడవ బహుమతి 15000/- రూ నగదు మరియు షీల్డ్ ను ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి చేతుల మీదుగా బహుకరీంచడం జరిగిందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూటన్స్ ఇంజనీరింగ్ కళాశాల సెక్రటరీ మరియు కరస్పాండెంట్ జున్నా శ్రీనివాసరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ జీ.జగదీశ్వర్ రెడ్డి, అధ్యాపకేతర సిబ్బంది, మరియు విద్యార్థినీ, విద్యార్థులు పాల్గొన్నారని తెలియజేశారు.

Tags:
Views: 21

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

*భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత* *భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత*
*భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత*
నేను కేసీఆర్ మాదిరిగా విజయం సాధిస్తా..
తిరుపతిలో దొంగల బెడద..
పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్‌డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.