అనారోగ్యంతో ప్రయాణికురాలు రైలులో మృతి  బెంగాల్ వాసిగా గుర్తింపు

అనారోగ్యంతో ప్రయాణికురాలు రైలులో మృతి  బెంగాల్ వాసిగా గుర్తింపు

ఐ న్ బి టైమ్స్ ప్రతినిధి, సెప్టెంబర్6:అనారోగ్యంతో రైలులో ప్రయాణిస్తుండగా మహిళమృతి చెందిన సంఘటన సూళ్లూరుపేట రైల్వే స్టేషన్ లో శనివారం చోటుచేసుకుంది. వివరాలు మేరకు పశ్చిమ బెంగాల్ ప్రాంతానికి చెందిన మహిళా  గత కొంతకాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ ఉండేదని, కుటుంబ సభ్యులు ఆమెను మెరుగైన చికిత్స కొరకు చెన్నై సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్యం చేయించుకునేందుకు వెళ్లడం జరిగిందని, వైద్య చికిత్స అనంతరం సొంత ఊరికి తిరిగి వెళుతుండగా  తమిళనాడు నుండి ఝార్ఖండ్ వెళ్లే రైలు (జెస్సిద్, త్రివేండ్రం) లో మహిళ మృతి చెందిన సంఘటన జరిగింది మృతురాలు కుటుంబ సభ్యులు సూళ్లూరుపేట రైల్వే శాఖ అధికారులకు సమాచారాన్ని అందించడం జరిగింది. రైల్వే స్టేషన్ కు చేరుకున్న అధికారులు రైలును ఆపి మృతదేహాన్ని బయటకు తీశారు. అనంతరం కుటుంబ సభ్యులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలిస్తున్నట్లు సమాచారం. రైలు ప్రయాణంలో మహిళా మృతి చెందడం ప్రయాణికులను తీవ్ర దిబ్భ్రాంతికి గురిచేసింది.

Tags:
Views: 38

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న.. మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, ఫిబ్రవరి 8:మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 అండర్ 19 పోటీలో గెలుపొందిన యశస్విని ఘనంగా సన్మానించిన కూకట్పల్లి ఉమ్మడి...
డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్‌డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.
భరత్ నగర్ కాలనీలో రెండవసారి  ‘మా దారి – మా హక్కు’ నిరసన
మానవత్వం చాటుకున్న మాచర్ల సిఐ టి.వెంకటరమణ
మాచర్లలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు–నిందితుడి అరెస్ట్..9 బైక్‌లు స్వాధీన
పశువులు మన సాంప్రదాయంలో భాగం
దేవాంగ కార్పొరేషన్ ఏర్పాటు – ఆత్మగౌరవ పోరాటానికి ప్రతీక