రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జనసేన పార్టీ నాయకుని కుటుంబానికి ఆర్థిక సహాయం

రోడ్డు ప్రమాదంలో చనిపోయిన జనసేన పార్టీ నాయకుని కుటుంబానికి ఆర్థిక సహాయం

ఐఎన్ బి టైమ్స్, జనవరి 26, వెల్దుర్తి.:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం, వెల్దుర్తి  మండలంలోని రచ్చ మల్లపాడు గ్రామానికి చెందిన జనసేన నాయకులు బేతం శెట్టి పెద్ద కొండలు గతేడాది రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఈ  రోజు వారి కుటుంబానికి నాదెండ్ల మనోహర్ చేతుల మీద 5 లక్షల రూపాయల చెక్కు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాచర్ల జనసేన పార్టీ సమన్వయ కర్త బూసా రామాంజనేయులు, ఉమ్మడి గుంటూరు జిల్లా కార్యదర్శి పులి హరి మరియు వెల్దుర్తి మండలం జనసేన పార్టీ అధ్యక్షులు గంధం మల్లయ్య, ఉపాధ్యక్షుడు తోట శ్రీను, గ్రామ అధ్యక్షుడు దండే రాజా, వాలంటీరు గుర్రాల మణి, చింతల మణి, రంగారావు, వెంకయ్య, అంజి పాల్గొన్నారు. గంధం మల్లయ్య మాట్లాడుతూ జనసేన పార్టీ కార్యకర్తలకు అండగా ఉండే పార్టీ అని మరియు  పవన్ కళ్యాణ్ కార్యకర్తల మంచి కోరుకునే వ్యక్తి అని పేర్కొన్నారు. వెల్దుర్తి మండలంలోని ప్రతి జనసేన  కార్యకర్త జనసేన పార్టీ క్రియాశీల సభ్యత్వం తీసుకుంటే ఏదైనా అనుకోని సంఘటనలు జరిగినప్పుడు వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని పేర్కొన్నారు 

 

Tags:
Views: 8

Advertisement

Latest News

తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి. తెలుగువారి తొలి పండుగ తొలి ఏకాదశి.
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జులై 06:దుర్గి మండలంలోని హిందూ దేవాలయాలల్లో తెలుగువారి తొలి పండుగ తొలిఏకాదశి వేడుకలను ఆదివారం భక్తులు భక్తి శ్రద్దలతో...
నీ చల్లని నీడలో.. నీ చక్కని సీమలో.. అంటూ భక్తులు.
మంచికల్లు కొండమీద స్వామి మమ్మల్ని మంచిగా చూడయ్యా
ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని అలవర్చుకోవాలి... ఆలయాల నిర్మాణాలకు సంపూర్ణ సహకారం
డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన కూకట్పల్లి ఇంచార్జ్: బండి రమేష్
వైసీపీ అధినేత జగన్ ను కలిసిన నియోజకవర్గ యువజన అధ్యక్షుడు పాలేటి నాగార్జున
జన సేవాదళ్ ఆధ్వర్యంలో చేయూత