పని భారం తగ్గించాలని మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం అందజేసిన సచివాలయం ఉద్యోగులు
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 06;మాచర్ల నియోజకవర్గ, మాచర్ల పట్టణంలో, శనివారం రోజు మాచర్ల పట్టణంలోని సచివాలయ సిబ్బంది, మరియు ఉద్యోగులు మాచర్ల మున్సిపల్ కమిషనర్ వారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల కమిటీ అధ్యక్షులు బాలసౌరి మాట్లాడుతూ, వాలంటీర్స్ కంటే ఎక్కువ పనిభారం మోపుతున్నారని, పని భారం తగ్గించాలని, గతంలో వాలంటీర్స్ చేసే పని కన్నా ఎక్కువగా, సచివాలయ సిబ్బందితో సర్వేలు, వాట్సాప్ సర్వీస్ రిజిస్ట్రేషన్ అని, ప్రతి ఇంటికి తిప్పుతూ, సర్వేల ద్వారా మా ఆత్మగౌరవాన్ని, మనోధైర్యాన్ని దెబ్బతీస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నటువంటి సర్వేల భారం నుంచి తప్పించాలని, మాచర్ల పట్టణంలోని సచివాలయ ఉద్యోగులు మున్సిపల్ కమిషనర్ డి.వేణుబాబుకి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ అసోసియేషన్ అధ్యక్షులు బాలశౌరి, ఉపాధ్యక్షుడు నాగేశ్వరరావు, కార్యదర్శి నాగమణి, కే.రాజేంద్ర, ఎం.మహేష్ వెంకట్రామయ్య, నాగరాజు,పలువురు సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
Comment List