ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం

పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా వెంకటేష్ నాయక్ నియామకం

ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం

అభినందనలు తెలిపిన పలువురు బంజారా సేవా సంఘం నాయకులు 

ఐ ఎన్ బి టైమ్స్ విజయపురిసౌత్ ప్రతినిధి సెప్టెంబర్ 15:ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా మాచర్ల మండలం చింతలతండా గ్రామానికి చెందిన రమావత్ భీమా నాయక్, పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా తాళ్లపల్లి గ్రామానికి చెందిన బాణావత్ వెంకటేష్ నాయక్ లు గుంటూరు పోలీస్ కళ్యాణ మండపము నందు ఆదివారం జరిగిన ఎన్నికలో ఎన్నికయ్యారు. రాష్ట్ర అధ్యక్షులు బాణావత్ చక్రి నాయక్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా  ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షులు టీసి రాథోడ్, అడిషనల్ డీజీపీ రిటైర్డ్ డీటి నాయక్, ఐజీపీ రిటైర్డ్ కొర్ర జగన్నాథరావు నాయక్, ఐఆర్ఎస్ రిటైర్డ్ స్వామి నాయక్, రిటైర్డ్ ఎస్పీ రవీంద్రా నాయక్, డాక్టర్లక్ష్మానాయక్, రిటైర్డ్ ఎస్పీ చాంద్  నాయక్, డాక్టర్ బాలాజీ నాయక్, మాజీ ట్రైకార్ చైర్మన్, తెదేపా రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు ఎం.ధారు నాయక్, ఐఏఎస్ చిన్న రాముడు నాయక్, బి.వి.రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా సోమవారం విజయపురిసౌత్లో మీడియాతో భీమా నాయక్ మాట్లాడుతూ రాష్ట్రంలోని బంజారాల సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడుతూ వారి అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామన్నారు. తమ ఎన్నికకు సహకరించిన సంఘం పెద్దలకు, శ్రేయోభిలాషులకు, తోటి సంఘీయులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బాణావత్ వెంకటేష్ నాయక్, పలువురు సంఘం నాయకులున్నారు.

Tags:
Views: 30

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
  ఐ ఎన్ బి టైమ్స్ విజయవాడ మార్చి 22:ప్రస్తుతం ఎల్‌పీజీ వంట గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని, అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని
తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్‌డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.
భరత్ నగర్ కాలనీలో రెండవసారి  ‘మా దారి – మా హక్కు’ నిరసన
మానవత్వం చాటుకున్న మాచర్ల సిఐ టి.వెంకటరమణ
మాచర్లలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు–నిందితుడి అరెస్ట్..9 బైక్‌లు స్వాధీన