సారా బట్టిపై దాడి చేసిన గోకవరం పోలీసులు.

50 లీటర్ల నాటు సారా పట్టివేత, 400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం...

సారా బట్టిపై దాడి చేసిన గోకవరం పోలీసులు.

ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, నవంబర్ 22:గోకవరం మండలం తిరుమలయపాలెం గ్రామ శివారు, కాలువ గట్టుపై సారా కాస్తున్నారన్న సమాచారంతో గోకవరం పోలీసులు సారా బట్టిపై దాడి చేశారు. ఈ దాడిలో సారా కాస్తున్న, అదే గ్రామానికి చెందిన బోయిడి వీరబాబు అనే వ్యక్తిని అరెస్టు చేసి, అతడి నుండి 50 లీటర్ల నాటు సారా స్వాధీనం చేసుకుని, 400 లీటర్ల బెల్లం ఊట ధ్వంసం చేసినట్లు గోకవరం ఎస్.ఐ. వి.ఎన్.వి. పవన్ కుమార్ తెలిపారు. అనంతరం ఆ వ్యక్తిని రిమాండ్ నిమిత్తం 1వ అదనపు జుడీష్యల్ మెజిస్ట్రేట్, రాజమహేంద్రవరం  ముందు హాజరుపరిచగా 14 రోజులు రిమాండ్ విధించినల్టు ఆయన తెలిపారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలం ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు తావులేదని, ఎవరైనా అటువంటి కార్యక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు చేసుకుంటామని ఎస్సై పవన్ కుమార్ తెలిపారు.

Tags:
Views: 25

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

*భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత* *భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత*
*భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత*
నేను కేసీఆర్ మాదిరిగా విజయం సాధిస్తా..
తిరుపతిలో దొంగల బెడద..
పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్‌డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.