పల్స్ పోలియో కేంద్రం ప్రారంభించిన: యాగంటి

పల్స్ పోలియో కేంద్రం ప్రారంభించిన: యాగంటి

ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి డిసెంబర్ 21:నేడు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని మాచర్ల టౌన్ నందు మాజీ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ యాగంటి మల్లికార్జున రావు ప్రారంభించి,చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...ఐదు సంవత్సరాలలోపు ప్రతి ఒక్క చిన్నారి పోలియో చుక్కలు వేయించుకోవాలని,రెండు పోలియో చుక్కలు అంగ వైకల్యాన్ని నివారిస్తుందని,ఈ రెండు చుక్కలు బిడ్డని పోలియోనుండి రక్షిస్తుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో  వార్డు అధ్యక్షులు బండ్ల బ్రహ్మం,చందు గౌడ్,పట్టణ ప్రధాన కార్యదర్శి బండ్ల శ్రీను,ఆరోగ్య సిబ్బంది రాయపాటి రాజకుమారి,హెల్త్ సూపర్వైజర్ శ్రీనివాస రావు,కుమారి తదితరులు పాల్గొన్నారు...

Tags:
Views: 16