పల్నాడు జిల్లా పార్లమెంటరీ సెక్రెటరీ గా ఎస్.కె జానిబాష ఎన్నికైన సందర్భంగా – బాల్యమిత్రుల ఘన అభినందనలు

పల్నాడు జిల్లా పార్లమెంటరీ సెక్రెటరీ గా ఎస్.కె జానిబాష ఎన్నికైన సందర్భంగా – బాల్యమిత్రుల ఘన అభినందనలు

ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి జనవరి 20:పల్నాడు జిల్లా పార్లమెంటరీ సెక్రటరీ గా మాజీ మున్సిపల్ కౌన్సిలర్ ఎస్.కె.జానిబాష ఎన్నిక కావడం పట్ల ఆయన బాల్యమిత్రులు హర్షం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బాల్యమిత్రులు కలిసి ఎస్.కె జానిబాష ని దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించి,అభినందనలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాల్యమిత్రులు మాట్లాడుతూ...పార్టీ పట్ల నిబద్ధతతో,ప్రజాసేవే లక్ష్యంగా రాజకీయ జీవితాన్ని కొనసాగిస్తున్న ఎస్.కె.జానిబాష ఈ పదవికి ఎన్నిక కావడం ఎంతో గర్వకారణమని తెలిపారు.మున్సిపల్ కౌన్సిలర్‌గా పనిచేసిన సమయంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేసిన ఆయనకు ఈ బాధ్యత మరింత ఉత్సాహాన్ని ఇస్తుందని పేర్కొన్నారు.పార్లమెంటరీ పార్టీ కార్యదర్శిగా ఎన్నికైన ఎస్.కె. జానిబాష మాట్లాడుతూ...తనపై నమ్మకం ఉంచి బాధ్యత అప్పగించిన పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు,నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయులు, మాచర్ల శాసనసభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి కి,కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.పార్టీ బలోపేతానికి, కార్యకర్తల సంక్షేమానికి అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు.తన రాజకీయ ప్రస్థానంలో ఎల్లప్పుడూ తోడుగా నిలిచిన బాల్యమిత్రుల సత్కారం మరచిపోలేనిదని భావోద్వేగంగా తెలిపారు.ఈ సత్కార కార్యక్రమం స్నేహబంధాలకు,రాజకీయ సేవాభావానికి చక్కటి నిదర్శనంగా నిలిచిందని స్థానికులు అభిప్రాయపడ్డారు.

Tags:
Views: 108

Advertisement

Latest News

2000 మంది విద్యార్థులతో హల్లెల్ మ్యూజిక్ స్కూల్  గిన్నీస్ వరల్డ్ రికార్డు కు ప్రయత్నం  2000 మంది విద్యార్థులతో హల్లెల్ మ్యూజిక్ స్కూల్  గిన్నీస్ వరల్డ్ రికార్డు కు ప్రయత్నం 
ఐ ఎన్ బి టైమ్స్ సికింద్రాబాద్ ఫిబ్రవరి 2:సికింద్రాబాద్ లోని జోరాష్ట్రీన్ క్లబ్ నందు హెల్లెల్ మ్యూజిక్ పాఠశాల విద్యార్థులు గిన్నీస్ వరల్డ్ రికార్డు కు ప్రయత్నించారు....
ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రజాసేవకు నిదర్శనం:షేక్ జానీ భాష
పోలేపల్లి లో గర్జన—మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజలు కొవ్వొత్తుల మహా నిరసన
పల్నాడు జిల్లా పార్లమెంటరీ సెక్రెటరీ గా ఎస్.కె జానిబాష ఎన్నికైన సందర్భంగా – బాల్యమిత్రుల ఘన అభినందనలు
స్మార్ట్ వ్యవసాయంతో రైతు ఆదాయం పెంపు -ప్రతి నీటి చుక్కను ఆదాయంగా మారుస్తాం
పల్స్ పోలియో కార్యక్రమంలో పాల్గొన్న కోమటి వీరు
పోలేపల్లి గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు