పోలేపల్లి లో గర్జన—మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజలు కొవ్వొత్తుల మహా నిరసన

పోలేపల్లి లో గర్జన—మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా ప్రజలు కొవ్వొత్తుల మహా నిరసన

ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 01:పల్నాడు జిల్లా,మాచర్ల నియోజకవర్గంలోని పోలేపల్లి గ్రామంలో మాజీ శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అక్రమంగా అరెస్టు చేశారన్న ఆరోపణలతో ప్రజలు,పార్టీ శ్రేణులు భారీ స్థాయిలో కొవ్వొత్తుల నిరసన కార్యక్రమం నిర్వహించారు.ప్రజాస్వామ్య విలువలను కాపాడాలన్న నినాదాలతో గ్రామమంతా వెలుగుల ర్యాలీగా మారి నిరసన గళం మార్మోగింది.గ్రామ ప్రధాన వీధుల గుండా వందలాది మంది చేతుల్లో కొవ్వొత్తులు పట్టుకుని శాంతియుతంగా సాగిన ఈ నిరసనలో మహిళలు,యువకులు,వృద్ధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.రాజకీయ కక్ష సాధింపుతోనే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేశారని వారు ఆరోపించారు.ప్రజల సమస్యల పరిష్కారంలో ముందుండే నాయకుడిని అణిచివేయాలనే ప్రయత్నం ప్రజలు ఎప్పటికీ సహించరని హెచ్చరించారు.ఈ సందర్భంగా పోలేపల్లి సర్పంచ్ బుసిరెడ్డి సాగర్ రెడ్డి మాట్లాడుతూ...“పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పేదల గుండెల్లో స్థానం సంపాదించిన ప్రజానాయకుడు.ఆయనపై అక్రమ అరెస్టు ప్రజాస్వామ్యంపై దాడి.ఇలాంటి చర్యలను ప్రభుత్వం వెంటనే నిలిపివేసి ఆయన్ను బేషరతుగా విడుదల చేయాలి”అని డిమాండ్ చేశారు.నిరసన సందర్భంగా గ్రామంలో న్యాయానికి మద్దతుగా నినాదాలు మార్మోగాయి.“అక్రమ అరెస్టులు నిలిపివేయాలి”,“ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి”, “పిన్నెల్లికి న్యాయం చేయాలి”అంటూ ప్రజలు గళమెత్తారు.ఈ కార్యక్రమం మొత్తం శాంతియుతంగా కొనసాగింది.పోలేపల్లిలో జరిగిన ఈ కొవ్వొత్తుల మహా నిరసన ప్రజల్లో న్యాయంపై ఉన్న నమ్మకాన్ని,ప్రజానాయకుడిపై ఉన్న ఆదరణను స్పష్టంగా చూపించింది. మాజీ ఎమ్మెల్యే అరెస్టుపై ప్రజల్లోనెలకొన్నఅసంతృప్తిరోజురోజుకుఉద్ధృతమవుతుండగా,ప్రభుత్వం స్పందించాల్సిన అవసరం ఉందన్న స్వరం బలంగావినిపిస్తోంది.

Tags:
Views: 19

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
  రాజానగరం నియోజవర్గ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ జన్మదిన వేడుకను కోరుకొండ గ్రామంలోఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు జనసేన అభిమానులు కూటమి నాయకులు భారీ
తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్‌డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.
భరత్ నగర్ కాలనీలో రెండవసారి  ‘మా దారి – మా హక్కు’ నిరసన
మానవత్వం చాటుకున్న మాచర్ల సిఐ టి.వెంకటరమణ
మాచర్లలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు–నిందితుడి అరెస్ట్..9 బైక్‌లు స్వాధీన