సీఎం ఆలోచనలకు అనుగుణంగా ఎస్.హెచ్.జి మహిళల స్వయం ఉపాధి
ఐ ఎన్ బి టైమ్స్ జగ్గయ్యపేట ఫిబ్రవరి 8:
సీఎంఆలోచనలకుఅనుగుణంగా ఎస్.హెచ్.జి మహిళల స్వయం ఉపాధికి ఎంపీ కేశినేని శివనాథ్ తోడ్పాటు ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతాయ్య)
హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి లో నైపుణ్యాభివృద్ధి శిక్షణకు ప్రత్యేక బస్సులో బయలుదేరిన 40 మంది ఎస్.హెచ్.జి మహిళలుజెండా ఊపి బస్సును ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)
కేశినేని ఫౌండేషన్ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో హ్యాండ్‌మేడ్ పేపర్ ప్రొడక్ట్స్ తయారీ పై శిక్షణపిబ్రవరి 9వ తేదీ నుంచి 13 వరకు హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్రధాన కార్యాలయంలో ఐదు రోజుల శిక్షణఎంపీ కేశినేని శివనాథ్ సారథ్యంలో ఎస్.హెచ్.జి మహిళలకు 11వ నైపుణ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమం జగ్గయ్యపేట ఇంటికో పారిశ్రామిక వేత్త వుండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆశయాన్ని ముందు తీసుకువెళ్లుందుకు ఎంపి కేశినేని శివనాథ్ కేశినేని ఫౌండేషన్ ద్వారా తన సొంత నిధులతో ప్రణాళిక బద్దంగా అడుగులు వేయటంతో పాటు మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు తోడ్పాటు అందిస్తున్నారని ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతాయ్య) అన్నారు.
ఎంపీ కేశినేని శివనాథ్ సారథ్యంలో కేశినేని ఫౌండేషన్ మరియు ఎన్.ఐ.ఆర్.డి సంయుక్త ఆధ్వర్యంలో హైదరాబాద్ ఎన్.ఐ.ఆర్.డి ప్రధాన కార్యాలయంలో ఈ నెల 9 నుండి 13వ తేదీ వరకు ఐదు రోజుల పాటు హ్యాండ్‌మేడ్ పేపర్ ప్రొడక్ట్స్ తయారీ విధానంపై శిక్షణ పొందేందుకు ఎన్టీఆర్ జిల్లా రూరల్ నియోజకవర్గాలకు చెందిన 40 మంది ఎస్.హెచ్.జి మహిళలతో ఒక ప్రత్యేక బస్సు ఆదివారం జగ్గయ్యపేట పట్టణం మున్సిపల్ కార్యాలయం వద్ద నుంచి బయలుదేరింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతాయ్య) శిక్షణ పొందేందుకు వెళుతున్న మహిళలకు శుభాకాంక్షలు తెలపటంతో పాటు వారితో స్వయం మాట్లాడి వారి ఆసక్తి తెలుసుకున్నారు. అనంతరం ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతాయ్య) జెండా ఊపి బస్సు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతాయ్య) మాట్లాడుతూ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేందుకు నైపుణ్యాభివృద్ధి శిక్షణలు ఎంతో దోహదపడతాయని, హ్యాండ్ మేడ్ పేపర్ ప్రొడక్ట్స్ వంటి ఉపాధి అవకాశాలు గ్రామీణ మహిళలకు స్థిరమైన ఆదాయ మార్గంగా మారుతాయన్నారు. కేశినేని ఫౌండేషన్ సహకారంతో మహిళలకు శిక్షణ, ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వస్తుండటంఅభినందనీయమని అన్నారు. ప్రభుత్వం మహిళల సంక్షేమం, ఉపాధి కల్పనకు ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు. గ్రామాలతో పాటు గ్రామాల్లోని మహిళల అభివృద్ది కోసం ఎన్.ఐ.ఆర్.డి తో కేశినేని ఫౌండేషన్ ఎమ్.వో.యు చేసుకోవటం చాలా గొప్ప విషయమంటూ ప్రశంసించారు. ఇందులో భాగంగా గ్రామీణ ప్రాంతాల స్వయం సహాయక సంఘాల మహిళలను స్వయం ఉపాధి మార్గం వైపు నడిపించేందుకు ఎంపీ కేశినేని శివనాథ్ కృషి చేస్తున్నారని తెలిపారు.అనంతరంఎన్.ఐ.ఆర్.డి రూరల్ కో-ఆర్డినేటర్ సొంగా సంజయ్ వర్మ మాట్లాడుతూ ఎంపీ కేశినేని శివనాథ్ నేతృత్వంలో గత ఏడాది నుంచి ఎస్.హెచ్.జి మహిళలకు ఎన్.ఐ.ఆర్.డిలో స్వయం ఉపాధి కి సంబంధించి నైపుణ్యాభివృద్ది శిక్షణ ఇప్పిస్తున్నారన్నారు. ఇప్పటి వరకు 10 నైఫుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాలు జరగ్గా అందులో తొమ్మిది శిక్షణా కార్యక్రమాల్లో జగ్గయ్యపేట ఎస్.హెచ్.జి మహిళలు పాల్గొన్నారని, వారంతా ఇప్పుడు స్వయంగా ప్రొడక్ట్స్ తయారు చేసి ఎంటర్ ప్రెన్యూర్స్ రాణిస్తున్నారని తెలిపారు. వీరు తయారు చేసే ప్రోడక్ట్స్ కూడా మార్కెటింగ్ చేసేందుకు కూడా ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతాయ్య) కృషి చేస్తున్నారని తెలిపారు. అలాగే తిరువూరు, నందిగామ, మైలవరం నియోజకవర్గాల్లోని ఎస్.హెచ్.జి మహిళలకు ఎన్.ఐ.ఆర్.డి నైఫుణ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమాలు ఇప్పించటం జరిగిందని...ఎంపీ కేశినేని శివనాథ్ సారధ్యంలో ఇదినిరంతరంజరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా ఎన్.ఐ.ఆర్.డి అర్బన్ కో-ఆర్డినేటర్ వల్లభనేని నరసింహాచౌదరి, జగ్గయ్యపేట మండల డెవలప్మెంట్ అధికారి జి.నితిన్, టిడిపి టౌన్ పార్టీ ప్రధాన కార్యదర్శి మైనేని రాధ, కౌన్సిలర్లు కన్నెబోయిన రామలక్ష్మీ, సూర్యదేవర రామ్ ప్రసాద్, నెక్కరికంటి వెంకటి, టిడిపి నాయకుడు ఎస్.కె.నజీమున్, మండల మహిళ సమైక్య అధ్యక్షురాలు నాయిని రజనీ, కృష్ణవేణి, వెలుగు ఎ.పి.ఎమ్ లు లక్ష్మణారావు, సంఘయ్య లతో పాటు ఎన్డీయే కూటమి నాయకులు పాల్గొన్నారు




Comment List