మానవత్వం చాటుకున్న మాచర్ల సిఐ టి.వెంకటరమణ

మానవత్వం చాటుకున్న మాచర్ల సిఐ టి.వెంకటరమణ

ఐ ఎన్ బి టైమ్స్ పల్నాడు జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 8: తప్పిపోయిన చిన్నారిని తల్లి చెంతకు చేర్చిన మాచర్ల పట్టణ సీఐ తురక వెంకటరమణ. మానవత్వానికి మరోసారి అర్థం చెప్పారు. బాధ్యతాయుతమైన విధి నిర్వహణతో పాటు, దయా గుణంతో వ్యవహరించి దారి తప్పిన ఏడేళ్ల చిన్నారిని క్షేమంగా ఆమె తల్లిదండ్రులచెంతకుచేర్చిఅందరిప్రశంసలుఅందుకున్నారు.వివరాల్లోకి వెళ్తే…గురజాల గ్రామానికి చెందిన పరస ప్రకాష్ కుమార్తె కావ్య (7) అనుకోకుండా దారి తప్పి తీవ్ర ఆందోళనకు గురైంది.చిన్నారి ఆచూకీ తెలియక తల్లిదండ్రులు తీవ్ర ఆవేదనకు లోనవుతున్న సమయంలో ఈ విషయం మాచర్ల పట్టణ పోలీసుల దృష్టికి వచ్చింది.సమాచారం అందుకున్న వెంటనే సీఐ తురక వెంకటరమణ తక్షణమే స్పందించి,పోలీసు సిబ్బందిని అప్రమత్తం చేశారు.చిన్నారి భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకొని,ఆచూకీ ఆధారంగా తల్లి పరస అన్నమ్మను పోలీస్ స్టేషన్‌కు పిలిపించారు.అనంతరం చిన్నారిని ఆమె తల్లి చెంతకు సురక్షితంగా అప్పగించారు.తమ బిడ్డను కళ్లెదుట చూసిన తల్లిదండ్రులు ఆనంద బాష్పాలతో సీఐ వెంకటరమణకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ...“రద్దీ ప్రదేశాల్లో,ప్రయాణాల్లో చిన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు మరింత అప్రమత్తంగా ఉండాలి.పిల్లల భద్రతే ప్రథమ ప్రాధాన్యం”అని సూచించారు.ఈ ఘటన ద్వారా మాచర్ల పట్టణ పోలీసుల మానవత్వం,సేవాభావం మరోసారి ప్రజల హృదయాలను తాకింది.

Ad
 

Tags:
Views: 13

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
  ఐ ఎన్ బి టైమ్స్ విజయవాడ మార్చి 22:ప్రస్తుతం ఎల్‌పీజీ వంట గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని, అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని
తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్‌డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.
భరత్ నగర్ కాలనీలో రెండవసారి  ‘మా దారి – మా హక్కు’ నిరసన
మానవత్వం చాటుకున్న మాచర్ల సిఐ టి.వెంకటరమణ
మాచర్లలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు–నిందితుడి అరెస్ట్..9 బైక్‌లు స్వాధీన