భరత్ నగర్ కాలనీలో రెండవసారి  ‘మా దారి – మా హక్కు’ నిరసన

ఇది ఉద్యమం కాదు… పాలన వైఫల్యానికి అద్దం

భరత్ నగర్ కాలనీలో రెండవసారి  ‘మా దారి – మా హక్కు’ నిరసన


ఐ ఎన్ బి టైమ్స్ కూకట్పల్లి ప్రతినిధి, ఫిబ్రవరి 8

Ad
కూకట్పల్లి–మూసాపేట పరిధిలోని భరత్ నగర్ కాలనీ ప్రజలు తమ మౌలిక హక్కైన రాకపోకల మార్గం కోసం మరోసారి రోడ్డెక్కారు. ప్రధాన రహదారికి వెళ్లే కాలనీ మార్గాన్ని పునరుద్ధరించాలనే డిమాండ్‌తో ‘మా దారి – మా హక్కు’ నినాదంతో ఈరోజు రెండోసారి నిరసన కార్యక్రమం నిర్వహించారు.
2017 సంవత్సరంలో ఒకప్పుడు సజావుగా ఉన్న రాకపోకల మార్గాన్ని పరిమితం చేసినప్పటి నుంచి కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూల్ పిల్లలు, ఉద్యోగులు, వృద్ధులు, అత్యవసర పరిస్థితుల్లో ఉన్న రోగులు — అందరికీ ఈ మూసివేత శాపంగా మారింది. పలుమార్లు అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం పాలనా నిర్లక్ష్యానికి నిదర్శనంగా ప్రజలు విమర్శిస్తున్నారు.ఒక కాలనీకి ప్రధాన రహదారికి వెళ్లే మార్గం కల్పించలేని పరిస్థితి ప్రజాస్వామ్యంలో తీవ్రమైన వైఫల్యమని నిరసనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజకీయ డిమాండ్ కాదని, జీవనానికి సంబంధించిన మౌలిక సమస్య అని వారు స్పష్టం చేస్తున్నారు.

 

Tags:
Views: 11

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
  ఐ ఎన్ బి టైమ్స్ విజయవాడ మార్చి 22:ప్రస్తుతం ఎల్‌పీజీ వంట గ్యాస్ సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని, అయితే భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని
తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్‌డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.
భరత్ నగర్ కాలనీలో రెండవసారి  ‘మా దారి – మా హక్కు’ నిరసన
మానవత్వం చాటుకున్న మాచర్ల సిఐ టి.వెంకటరమణ
మాచర్లలో ద్విచక్ర వాహనాల దొంగతనాలు–నిందితుడి అరెస్ట్..9 బైక్‌లు స్వాధీన