వైజాగ్ లో అర్ధరాత్రి యాసిడ్ కలకలం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై యాసిడ్ దాడి...

వైజాగ్ లో అర్ధరాత్రి యాసిడ్ కలకలం ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులపై యాసిడ్ దాడి...


 ఐ ఎన్ బి న్యూస్ వైజాగ్ నవంబర్ 30 :ఆర్టీసీ బస్సులో తమ గమ్యస్థానాలకు వెళ్తున్న మహిళలపై అనూహ్యంగా దూసుకొచ్చిన ఓ దుండగుడు యాసిడ్‌ విసిరాడు. ఆ వెంటనే బస్సులో నుంచి దూకి పరారయ్యాడు.ఏం జరిగిందో తెలిసేలోపు యాసిడ్‌ దాడితో తీవ్ర గాయాలపాలయ్యారు. యాసిడ్‌ మంటలకు తాళలేక కేకలు వేయడంతో వెంటనే స్థానికులు స్పందించి వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన రాత్రిపూట విశాఖపట్టణంలో కలకలం రేపింది. పోలీసులు అక్కడకు చేరుకుని విచారణ చేపట్టారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.విశాఖపట్టణంలోని కంచరపాలెం ఐటీఐ జంక్షన్ వద్ద శుక్రవారం రాత్రి వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు. ఆ వెంటనే తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను చల్లాడు. యాసిడ్‌ దాడితో ముగ్గురు మహిళలు గాయపడ్డారు. వెంటనే ఆర్టీసీ బస్సు డ్రైవర్‌, కండక్టర్‌ బస్సును నిలిపివేశారు. దుండగుడిని పట్టుకునేందుకు ప్రయత్నం చేయగా అప్పటికే అతడు పారిపోయాడు. యాసిడ్‌ దాడితో కళ్లు మండుతుండడంతో మహిళలను వెంటనే స్థానికులు ఆటోలో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు

Tags:
Views: 49

About The Author

Related Posts

Post Comment

Comment List

Advertisement

Latest News

*భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత* *భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత*
*భక్తులకు అలర్ట్.. కేదార్నాథ్ దర్శనం తాత్కాలికంగా నిలిపివేత*
నేను కేసీఆర్ మాదిరిగా విజయం సాధిస్తా..
తిరుపతిలో దొంగల బెడద..
పైప్డ్ గ్యాస్‌ సుర‌క్షితం, సౌక‌ర్య‌వంతం పీఎన్‌జీ క‌నెక్ష‌న్ దిశ‌గా ప్ర‌జ‌లు దృష్టిసారించాలి రావాలి జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌
తాటికొండ బుజ్జి  ఆధ్వర్యంలో ఘనంగా ఎమ్మెల్యే బత్తుల బల రామకృష్ణ జన్మదిన వేడుక
మిస్ గ్రాండ్ తెలంగాణ 2026 యశస్విని నీ సన్మానించిన ఇష్టకామేశ్వరి కోలాటం టీం, కూకట్పల్లి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఎర్ర యాకన్న..
డయాబెటిస్, స్థూలకాయం చికిత్సకు కొత్త దిశ చూపిన పరిశోధన, పీహెచ్‌డీ పట్టా పొందిన కోనా వెంకట శ్రీ కృష్ణ.