కొప్పాయి పాలెం చెరువులో మట్టి దొంగలు పడ్డారు... అధికారులు ఏమయ్యారు...?

కొప్పాయి పాలెం చెరువులో మట్టి దొంగలు పడ్డారు... అధికారులు ఏమయ్యారు...?

 

Ad
 ఐ ఎన్ బి టైమ్స్ వెంకటగిరి, జులై 13 : అవినీతి, అక్రమాలు పరాకాష్టకు చేరుతున్న అరికట్టాల్సిన అధికార యంత్రాంగం ఏమయ్యారని మండల ప్రజానీకం ప్రశ్నిస్తున్నారు. పట్ట  పగలే డక్కిలి మండల పరిధిలోని కొప్పాయిపాలెం చెరువులో మట్టి దొంగలు పడి టన్నులకొద్దీ మట్టిని భారీ యంత్రాలతో తరలించకపోతున్న రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు ఎందుకు చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు ఉన్నాయి. చదునుగా ఉన్న చెరువును భారీ యంత్రాలతో తవ్వేసి గుంతల మయం చేసేసి, మట్టితో వ్యాపారం సాగించి లక్షల గడిస్తున్నారు. చదునుగా ఉన్న చెరువులను భారీ యంత్రాలతో బావులుగా మార్చడం, వర్షాకాలం నీరు చేరి ఆ గుంతల్లో ఆదమరిచి పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. నేడు మట్టి మాఫియా జోరుగా సాగుతుంది. మేము అధికార పార్టీ నాయకులం, ఎమ్మెల్యే అనుచరులం అంటూ మట్టి

 తరలింపు సాగిస్తున్నారు. రోజు రోజుకు అక్రమ వ్యాపారాల దందా అధికమవుతున్న ఏ ప్రభుత్వ అధికారి చర్యలు చేపట్టక చూసి చూడనట్లు వ్యవహరించడంతో అక్రమ వ్యాపారాలు ఊ పందుకుంటున్నాయి. గ్రామంలో ఎవరైనా ఇంటి అవసరాలకు మట్టి తవ్వకాలు చేపట్టాలనుకుంటే వారిపై చర్యలు తీసుకుంటున్నారు కానీ, వ్యాపారంగా చెరువు మట్టిని తరలించకపోతున్న మట్టి దొంగలను కట్టడి చేయలేకపోతున్నారు. దీని వెనుక రాజకీయ పార్టీ నేతల అండదండలు ఉన్నాయా! రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు వారి ప్రలోభాలకు లోనయ్యారా అనేది కూడా ఓ కోణంలో చర్చించుకుంటున్నారు. సంబంధిత జిల్లా అధికారులు చర్యలు చేపట్టి చదునుగా ఉన్న చెరువులను కాపాడాలని ఆ గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

Tags:
Views: 41

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం