దాడిలో గాయపడిన పవన్ ని అన్ని విధాలా ఆదుకుంటాం

ఎస్సీ కమిషన్ చైర్మన్ కె ఎస్ జవహర్

దాడిలో గాయపడిన పవన్ ని అన్ని విధాలా ఆదుకుంటాం

ఐ ఎన్ బి టైమ్స్: తిరుపతి క్రైమ్ ప్రతినిధి, ఆగస్టు 12 :దాడిలో గాయపడిన పవన్ ని  పరామర్శించి అతనిని అన్ని విధాల ప్రభుత్వం  ఆదుకుంటుందని ఎస్సీ కమిషన్ చైర్మన్ కె . ఎస్. జవహర్ మీడియా సమావేశంలో తెలియజేసారు.మంగళవారం స్థానిక రుయా ఆసుపత్రి నందు దాడిలో గాయపడిన పవన్ ని పరామర్శించి అనంతరం పాత్రికేయ సమావేశంలో మాట్లాడుతూ .. ఈ నాటి రాకెట్ యుగంలో ఇలాంటి అవాంచనీయ సంగటనలు జరగటం చాలా దురదృష్ట కరం అని అన్నారు. బలహీనులపై దాడులు చేయడం దారుణమని, ఇప్పుడే బాధితుడైన పవన్ తో మాట్లాడానని సుమారు 25 మంది చుట్టుముట్టి దాడి చేశారని అందులో 16 మందిని పేర్లతో సహా గుర్తించానని తెలిపాడని అన్నారు.  అందులో  గుర్తించిన వారందరి పైన కేసులు నమోదు చేశారని తెలిపారు. అతనికి ప్రభుత్వం అట్రాసిటీ తరఫున రావాల్సిన రాయితీలు అన్ని అందేలా చూస్తామన్నారు. దాడి చేసిన వారు ఎంతటి వారైనా చట్ట పరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఎవరిని ఉపేక్షించేది లేదని తెలిపారు. ఈ ప్రభుత్వం ఏర్పడ్డాక దళితులకు అండంగా ఉండాలని ఎస్సీ కమిషన్ చైర్మన్ గా నన్ను నియమించారని ఆ పదవికి న్యాయం చేసే విధంగా బాధ్యతలు నిర్వర్తిస్తానని తెలిపారు. రాజకీయాలకతీతంగా ఏ దళితుల మీద దాడి జరిగిన సరే చట్ట ప్రకారం వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి ఎటువంటి కుల మతాలు అడ్డు రాలేదని అలాంటి  మహోన్నతమైన ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయ౦టే చాలా దురదృష్టకరమని తెలిపారు. ఈ విషయమై ఎస్పీతో మాట్లాడి డాడీ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు. అట్రాసిటీ కేసు అంటే దాడి చేసిన వారు,  చూసినవారు కూడా  శిక్షార్హులని అన్నారు.  అలాగే ఆసుపత్రి నందు చికిత్స పొందుతున్న పవన్ కి అవసరమైన వైద్య సదుపాయాలను కల్పించాలని వైద్య అధికారులకు సూచించామన్నారు.. ఈ అట్రాసిటీ కేసు కొరకు అవసరమైతే ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన నిందితులకు శిక్షపడేలా  చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రాంతం మాత్రమే  కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా దళితులకు న్యాయం జరిగేలా చూస్తామని తెలిపారు. 
ఈ సమావేశంలో స్థానిక శాసనసభ్యులు ఆరణి శ్రీనివాసులు, యాదవ కార్పోరేష చైర్మన్ నరసింహ యాదవ్, గ్రీన్ అండ్ బ్యుటిఫికేషణ్ చైర్మన్  సుగుణమ్మ, మాజీ ఎం.ఎల్.ఎ లు పరసారత్నం, సూరజ్, శ్రీధర్ వర్మ, దళిత సంఘ నాయకులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 2

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం