నవజీవన్ ఆర్గనైజేషన్-సి.సి-ఎపిశాక్స్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో హెచ్.ఐ.వి,ఎయిడ్స్ పై అవగాహన
ఐ ఎన్ బి న్యూస్ నాయుడుపేట మే 22:ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ,నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో మన సంస్కృతి కళా సంస్థ బృందం వారు గురువారం వీధి నాటకాలు ప్రదర్శిస్తూ హెచ్.ఐ.వి,ఎయిడ్స్ పై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్బంగా నాయుడుపేట ఆర్.టి.సి బస్టాండ్,విన్నమాల ప్రాంతాల్లో వీధి నాటకాలు ప్రదర్శించి హెచ్.ఐ.విఎయిడ్స్ వ్యాధి ఎలా వస్తుందనే విషయాలను వివరించారు, అలాగే వ్యాధి ఎలా వ్యాపించదు, హెచ్.ఐ.వి, ఎయిడ్స్ రాకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, హెచ్.ఐ.వి,ఎయిడ్స్ వ్యాధిగ్రస్తుల పట్ల వివక్షత చిన్న చూపు లేకుండా ఎలాగా సమాజములో కలసి జీవించాలి, హెచ్.ఐ.వి, ఎయిడ్స్ క్షయ వ్యాధి సంబందం గూర్చి, సుఖ వ్యాధులు, చికిత్స,కండోమ్ యొక్క ఉపయోగాలను, హెచ్.ఐ.వి,ఎయిడ్స్ ఏక్ట్ 2017 పై ప్రజలలో మన సంస్కృతి కళాసంస్థ-రెడ్డప్ప బృందం వారు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమములో నవజీవన్ సి.సి ప్రాజెక్టు మేనేజర్ కె.బాలాజి, ఓ.ఆర్.డబ్ల్యూలు శ్రావణి,సాయి లక్ష్మి,ఎ.యన్.యమ్ జి.శ్రీ లత, పి.ఇ లు తదితరులు పాల్గొన్నారు.
Comment List