రేషన్ సరుకులు అమ్మిన, కొన్న కేసులు నమోదు చేస్తాం
శ్రీకాళహస్తి ఆర్డీఓ భాను ప్రకాష్ హెచ్చరిక
ఐ ఎన్ బి టైమ్స్ పిచ్చాటూరు మే 22:ప్రభుత్వం అందించే రేషన్ సరుకులు ఎవరైనా కొన్న, అమ్మిన కేసులు నమోదు చేస్తామని శ్రీ కాళహస్తి రెవిన్యూ డివిజన్ అధికారి భాను ప్రకాష్ హెచ్చరించారు. గురువారం పిచ్చాటూరు లో నూతనంగా నిర్మించిన పౌర సరఫరాలు గోదాము ను ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తో కలిసి ఆర్డీఓ భాను ప్రకాష్ ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ పేదలకు ఉచితంగా రేషన్ సరుకులు అందించి ఆదుకోవాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం బియ్యాన్ని ఎక్కువ ధరకు కొని రేషన్ ద్వారా పంపిణీ చేస్తోందన్నారు. అలా పేదల కోసం ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్ బియ్యం, సరుకులు ను ఎవరైనా కొన్నా, అమ్మినా చట్ట ప్రకారం నేరమని, ఇలాంటి వాటిపై కటినంగా వ్యవహరిస్తామని ఆర్డీఓ తెలిపారు.వెయ్యి టన్నుల గోడౌన్ ఈ ప్రాంతంలో నిర్మించడం విశేషం అన్నారు. డీలర్లు దీనిని సద్వినియోగం చేసుకోవాలని, ప్రజలకు సక్రమంగా రేషన్ సరుకులు అందించాలని ఆయన కోరారు.



Comment List