ఉత్తమ సేవా అవార్డు గ్రహీతలు
అనిల్ శాస్త్రి, సోమ్లానాయక్ లకు శుభాకాంక్షలు
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి జనవరి 26:పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం దుర్గి విధి నిర్వహణయే ఘనత కు మార్గం అనిభావించి మండల కేంద్రమైన దుర్గి తహసీల్దార్ కార్యాలయంలో డేటా ఆపరేటర్ గా, మంగళగిరి అనిల్ శాస్త్రి, అటెండర్ గా, ఆర్. సోమ్లానాయక్ లు చేసిన ఉత్తమ సేవలు విధి నిర్వహణ, ప్రభుత్వం గుర్తించింది.వారికి ఉత్తమ సేవా అవార్డుకు ఎంపిక చేసింది.76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా, నర్సరావుపేట జిల్లా కలెక్టర్ కార్యాలయం లో ఆదివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ అరుణ బాబు చేతులమీదుగా ఉత్తమ సేవా అవార్డులను అందుకున్నారు. ఈ శుభసందర్భంగా విరువురిని తహసీల్దార్ కార్యాలయంలోని తహసీల్దార్ ఫణింద్ర కుమార్, సీనియర్ అసిస్టెంట్ నిర్మల, వి ఆర్ ఓ లు, వి ఆర్ ఎ లు, ఆఫీస్ సిబ్బంది, స్నేహితులు. బంధు మిత్రులు హార్షం వ్యక్తంచేస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

Tags:
Views: 35
Latest News
23 Nov 2025 10:19:01
ఐ ఎన్ బి టైమ్స్ కారంపూడి ప్రతినిధి నవంబర్ 22:మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు చిరుమామిళ్ల మధుబాబు కు "పల్నాడు జిల్లా అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ...



Comment List