కారంపూడి లో జరిగే "స్త్రీ శక్తి" భారీ బహిరంగ సభను విజయవంతం చేయండి: గోళ్ళ.సురేష్ యాదవ్
ఐఎన్ బి టైమ్స్ కారంపూడి ప్రతినిధి ఆగష్టు 28;సూపర్ సిక్స్ హామీల్లో కీలక పథకమైన స్త్రీ శక్తి పథకాన్ని విజయవంతంగా అమలు చేసి, మహిళామణులు అందరికి ఆర్థిక భరోసాను చేకూర్చిన కూటమి ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపేందుకు మహిళలచే కారంపూడి మండల కేంద్రంలోని ఆర్ & బి బంగ్లా ఎదురుగా నేడు(శుక్రవారం) నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని మండల అధ్యక్షులు గోళ్ళ. సురేష్ యాదవ్ కోరారు. ఈ సందర్భంగా గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సూపర్ సిక్స్ హామీలన్నీ 90శాతం అమలయ్యాయని, ఏడాది కాలంలోనే ప్రజలకు సంతృప్తికరమైన సంక్షేమాన్ని చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అందించిందని వివరించారు. మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం, ఉచిత గ్యాస్ సిలిండర్లు, తల్లికి వందనం వంటి పథకాలను అమలు చేసి, ఆడపడుచుల ఆర్థిక ప్రగతికి చేయూతనందిస్తున్నామని ఆయన అన్నారు. ఈ సభకు నియోజకవర్గంలోని అన్నీ మండలాల నుంచి పెద్ద ఎత్తున మహిళలు తరలివచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు.
Comment List