అధ్యాపకులు ఆవుల వీరాంజనేయులుకు తెలుగు తేజం అవార్డు బహూకరణ
తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా అవార్డు బహుకరణ
By M.Suresh
On
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 02గిడుగు వెంకట రామ్మూర్తి పంతులు జన్మదినమైన ఆగస్టు 29 న, తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా, శ్రీ శ్రీ కళావేదిక వారు తెలుగు తేజం అవార్డులను పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని, భువనచంద్ర టౌన్ హాల్ నందు ఆదివారం అందించుట జరిగినది. ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా నరసరావుపేట ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు, రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాచర్ల పట్టణానికి చెందిన అధ్యాపకులు ఆవుల వెంకట వీరాంజనేయులు యూనివర్సల్ ఫౌండేషన్ను స్థాపించి విద్యా, క్రీడలు, కళలు, దివ్యాంగులు, అంధులు మరియు పలు రంగాల అభివృద్ధికై కృషి చేస్తున్నందుకుగాను తెలుగు తేజం అవార్డును అందుకోవడం జరిగినది. వారి కుమార్తెలు గానము మరియు నృత్యాలతో అతిధులను, తెలుగు కవులను మరియు ప్రేక్షకుల అందరినీ అలరించారు.
Tags:
Views: 29
About The Author
Related Posts
Post Comment
Latest News
25 Sep 2025 08:14:58
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
Comment List