విఘ్నేశ్వరుడి కృపతో వరికపూడిశెల నిర్విఘ్నంగా పూర్తి కావాలి : ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
ఐఎన్ బి టైమ్స్, వెల్దుర్తి ప్రతినిధి, ఆగష్టు 27:విఘ్నేశ్వరుడి కృపతో నిర్విఘ్నంగా వరికపూడిశెల ప్రాజెక్ట్ నిర్మాణ పనులు జరగాలని ప్రార్ధించినట్లు మాచర్ల శాసన సభ్యులు జూలకంటి బ్రహ్మానందరెడ్డి చెప్పారు. బుధవారం వెల్దుర్తి లోని స్ధానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం వద్ద వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ప్రత్యేకంగా అలంకరించిన మండపంలో ఆశీనులైన గణపతికి ఎమ్మెల్యే జూలకంటి దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నియోజకర్గ సర్వతోముఖాభివృద్ధి, వరికపూడిశెల ప్రాజెక్ట్ నిర్మాణం శరవేగంగా జరగాలని పూజా కార్యక్రమంలో ఎమ్మెల్యే సంకల్పం చేసుకున్నారు. ప్రజలు, కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు తలపట్టిన ప్రతికార్యం విఘ్నాలు తొలగి, విజయవంతంగా పూర్తి కావాలిని స్వామి వారిని ప్రార్ధించినట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పేర్కొన్నారు. చవితి పూజూ కార్యక్రమాల్లో ఎమ్మెల్యే జూలకంటి సతీమణి శోభారాణి పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Comment List