వికలాంగుల మహాగర్జన సభకు తరలిరండి :రమేష్

వికలాంగుల మహాగర్జన సభకు తరలిరండి :రమేష్

ఐ ఎన్ బి టైమ్స్ దుర్గి ప్రతినిధి ఆగస్టు 28: అభినవ అంబేద్కర్" మహా జననేత" "పద్మశ్రీ "మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు...దుర్గి మండలంలోని "ఓబులేసుని పల్లె" గ్రామంలో గురువారం ఎమ్మార్పీఎస్ దుర్గి మండల అధ్యక్షులు" ఎండూరి నాగరాజు మాదిగ "ఆధ్వర్యంలో  " VHPS "వికలాంగుల హక్కుల పోరాట సమితి "18 వ ఆవిర్భవ దినోత్సవాన్ని" ఘనంగా" నిర్వహించారు. ఈ యొక్క కార్యక్రమానికి "ముఖ్య అతిథి" గా "కందుకూరి రమేష్ మాదిగ" "ఎమ్మార్పీఎస్   ఉపాధ్యక్షులు" "పల్నాడు జిల్లా" హాజరయ్యారు. ఈ సందర్భంగా రమేష్ మాదిగ మాట్లాడుతూ ఈరోజు ఈ యొక్క "వికలాంగు హక్కుల పోరాట సమితి" "18వ ఆవిర్భావ దినోత్సవం" జరుపుకోవడం చాలా సంతోషకరమని అలాగే 19వ సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా "వికలాంగు లందరికీ "పద్మశ్రీ "మంద కృష్ణ మాదిగ   తరఫునుంచి" ప్రత్యేక ధన్యవాదాలు" తెలియజేశారు. మరియు 18 సంవత్సరాల నుంచి "కృష్ణ మాదిగ  వికలాంగుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ప్రతి ఒక్కరికి కూడా గతంలో  200 రూపాయల నుంచి ఈరోజు 6000 రూపాయలు" పింఛన్ " తీసుకుంటున్నాము అంటే అది కేవలం కృష్ణ మాదిగ పుణ్యమని   ఈ సందర్భంగా రమేష్ తెలియజేశారు. అలాగే వికలాంగులకు సమాజంలో మంచి గుర్తింపు తెచ్చి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు అంటే అది కృష్ణ మాదిగ   ఇచ్చినటువంటి ధైర్యం అని ఆయన అన్నారు. అలాగే" సెప్టెంబర్  9 వ" తారీఖున" హైదరాబాద్  లో జరిగే "వికలాంగుల మహాగర్జన "సభకు" దుర్గి మండలం "నుంచి వేలాదిమంది "వికలాంగులు" తరలి వెళ్లి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగులు దుర్గం విజయ్ కుమార్, మారెపోగు రాములు, కొమ్ము సైదులు ,విజయ్ ,అక్కయ్య మిరియాల నాగరాజు, కొమ్ము లక్ష్మయ్య, కుంటి దానియేలు  తదితరులు పాల్గొన్నారు.

Tags:
Views: 58

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం