ఆంధ్ర రాష్ట్ర ఆపద్భాందవునికి ఆకు పూజ
ఐ ఎన్ బి టైమ్స్ రాజుపాలెం ప్రతినిధి సెప్టెంబర్ 2:
ఆంధ్ర రాష్ట్ర ఆపద్భాందవుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సంధర్భంగా మంగళవారం తెల్లవారుఝామున తొలి పూజగా కోళ్ళూరు శ్రీ ప్రసన్నాంజనేయే స్వామి వారి దేవస్థానంలో ఆకుపూజ నిర్వహించినట్లు జనసేన పార్టీ మండల ప్రధాన కార్యదర్శి కేదారి రమేష్ తెలిపారు.ఆయన జన్మదినం మా పార్టీ కార్యకర్తలకు ఒక పర్వదినమని ఆయన పేర్కొన్నారు. ఒక మాటలో చెప్పాలంటే ఆయనకు మేము కార్యకర్తలమో లేదా అభిమానులమో అని చెప్పడం కరెక్ట్ కాదన్నారు. మేము ఆయన భక్తులమని అభిమానాన్ని చాటారు.
వారి అభిమాన నాయకుడిపై వారికున్న ప్రేమను, భక్తిని, ఆరాధనను మాటల్లో చెప్తూ. ఈ రోజు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రం ఈ పరిస్థితుల్లో ఉందంటే, ప్రజలంతా సంతోషంగా ఉన్నారంటే దానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ ఆయన తెలిపారు.ఈ తరం చూసిన ఛత్రపతి శివాజీ మా పవన్ కళ్యాణ్ అన్న గారని మాట్లాడారు. చివరిగా అందరూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.పూజా కార్యక్రమంలో సర్పంచులు పసుపులేటి వెంకటస్వామి, కుందురు పేతురు, చొక్కా మల్లికార్జునరావు, పగడాల శ్రీనివాసరావు, కొజ్జా శ్రీనివాసరావు, సమారి సైదారావు, చిట్టెంశెట్టి గోపి, చిట్టెంశెట్టి నరేంద్ర, గుడారి గంగారావు, సఖినాల ధర్మారావు తదితరులు పాల్గొన్నారు

Comment List