మాచర్ల రోటరీ క్లబ్ వారి ఆధ్వర్యంలో ఉచిత మట్టి గణేశుని విగ్రహ ప్రతిమలు అందజేత
ఐఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి ఆగష్టు 27:పల్నాడు జిల్లా మాచర్ల పట్టణం లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పర్యావరణ హిత మట్టి గణేశుడి విగ్రహ ప్రతిమలు పార్క్ సెంటర్ లో పట్టణ ప్రజలకు ఉచితంగా బుధవారం అందజేయడం జరిగింది. ఈ సందర్బంగా రోటరీ, మాచర్ల అధ్యక్షులు తుమ్మల సత్య ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలు జల కాలుష్యానికి మూల కారణమైన ప్లాస్టర్ అఫ్ పారిస్ విగ్రహాలు వాడకుండా, రోటరీ క్లబ్ తరపున 500 మట్టి విగ్రహాలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ప్రభుత్వ వైద్యశాల నందు 100 మొక్కలు నాటిన రోటరీ క్లబ్ సభ్యులుమాచర్ల పట్టణంలో 3150రోటరీ డెసిగ్నేషన్ డే ను పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా మన మాచర్ల పట్టణ ప్రభుత్వ వైద్యశాల నందు 100 మొక్కలు నాటడం జరిగినది...
మాచర్ల పట్టణంలో ఇలాంటి ఎన్నో మంచి కార్యక్రమాలు నిర్వహిస్తూ సేవా దృక్పథంతో ముందుకు సాగుతున్న రోటరీ క్లబ్ సేవా కార్యక్రమాలను పలువురు పట్టణ ప్రజలు కొనియాడడం జరిగినది. రోటరీ క్లబ్ ప్రెసిడెంట్ తుమ్మల ప్రసాద్, కార్యదర్శి ఆలేటి కోటేశ్వరరావు,కోశాధికారి యనమదల వెంకట్రామయ్య మాట్లాడుతూ ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్క సభ్యులకు రోటరీ క్లబ్ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సభ్యులు డాక్టర్ రామకోటయ్య, నాగూర్ వలి,సిద్ధం రాజు,రామ్మూర్తి,శంకర్ సత్యనారాయణ, గుండా నాగేశ్వరరావు,పోలూరు శ్రీను, మేడం నాగేశ్వరరావు, తిర్లికా శ్రీనివాసరావు, ఎస్ నరసింహారావు,జెవికెఎస్ ప్రసాద్, చెరుకూరి నరసింహారావు, లీలా ప్రసాద్ మొదలగు వారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది.
Comment List