వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపిన దీనమ్మ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ చిల్డ్రన్ హోమ్ చిన్నారులు
ఐ ఎన్ బి టైమ్స్ రాజుపాలెం ప్రతినిధి ఆగస్టు 27:
రాజుపాలెం ప్రజల జీవితాల్లోని అన్ని విఘ్నాలు తొలగిపోయి విజయాలు దరిచేరాలని, సకల శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ వినాయక చవితి పర్వదినం సందర్భంగా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు రాజుపాలెం మండలం కొండమోడు పరిధిలోని వీరమ్మ కాలనీలో దీనమ్మ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చిల్డ్రన్ హోమ్ విద్యార్థులు వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చిల్డ్రన్ హోమ్ నందు వినాయక విగ్రహాన్ని ప్రత్యేక పూజలు చిన్నారులు నిర్వహించారు.
ఈ సందర్భంగా అందరూ సుఖ సంతోషాలతోమంచివిద్యావంతులు కావాలని మాకు సహాయ సహకారాలు అందిస్తున్న దాతృత్వం కలిగిన దాతలకుగణనాయకుడైన వినాయకస్వామి జ్ఞానం, బలం, ధైర్యం ప్రసాదించే దేవుడు. ప్రతి కుటుంబంలో సుఖశాంతులు, ఐశ్వర్యం నెలవాలని, స్నేహసౌభ్రాతృత్వాలు మరింత బలపడాలని కోరుకుంటున్నా. సమాజంలో ఐక్యత, అభివృద్ధి, శ్రేయస్సు నెలకొని ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం ప్రసరించాలి అని ఆశాభావం వ్యక్తం చేశారు.అలాగే వినాయక చవితి పండుగ మనకు ధర్మం, క్రమశిక్షణ, ఐక్యత విలువలను గుర్తు చేస్తుందని, సంప్రదాయాలతో పాటుగా సామాజిక సేవకు కూడా ప్రాధాన్యం ఇవ్వాలని దీనమ్మ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ చిల్డ్రన్ హోమ్ చిన్నారులుతెలిపారు.
Comment List