డ్రైవర్స్ కాలనీలో రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీ...పాల్గొన్న కూటమి నాయకులు, వీఆర్వో..

డ్రైవర్స్ కాలనీలో రేషన్ స్మార్ట్ కార్డులు పంపిణీ...పాల్గొన్న కూటమి నాయకులు, వీఆర్వో..

ఐ ఎన్ బి టైమ్స్, గోకవరం ప్రతినిధి, ఆగస్టు 27:కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రేషన్ స్మార్ట్ కార్డుల పంపిణీ కార్యక్రమం మండల కేంద్రమైన గోకవరం గ్రామంలో స్థానిక డ్రైవర్స్ కాలనీలో బుధవారం కూటమి నాయకుల ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా కూటమి నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో రేషన్ పంపిణీ లో జరిగిన అవకతవకలను దృష్టిలో ఉంచుకుని ఈ రేషన్ స్మార్ట్ కార్డుల విధానాన్ని కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టడం జరిగిందని అన్నారు. రేషన్ పక్కదారి పట్టకుండా ఉండేందుకు ఈ స్మార్ట్ కార్డులు ఉపయోగపడతాయన్నారు. ఈ స్మార్ట్ కార్డ్ ద్వారా రాష్ట్రంలో ఎక్కడైనా రేషన్ తీసుకునే అవకాశం లబ్ధిదారులకు ఉంటుందని ఈ సందర్భంగా కూటమి నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల బీసీ సెల్ అధ్యక్షులు పాలాడి శ్రీనివాసరావు(తెదేపా), టౌన్ యూత్ అధ్యక్షులు దోసపాటి సుబ్బారావు (జనసేన), మండల మీడియా సెల్ అధ్యక్షులు మహిపాల పాండురాజు, సండ్రు బుచ్చిరాజు (జనసేన), కవల ప్రసాద్ (జనసేన), పడాల చిన్న (జనసేన), వీఆర్వో వెంకటరమణ, రేషన్ డీలర్, రేషన్ లబ్ధిదారులు పాల్గొన్నారు...

Tags:
Views: 4

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం