ఎన్నో ఏళ్ల ఇరకం దీవి మత్స్యకార ప్రజల కల నేడు నెరవేరింది: ఎమ్మెల్యే నెలవల. విజయశ్రీ '

ఎన్నో ఏళ్ల ఇరకం దీవి మత్స్యకార ప్రజల కల నేడు నెరవేరింది: ఎమ్మెల్యే నెలవల. విజయశ్రీ '

ఐ ఎన్ బి టైమ్స్ సూళ్లూరుపేట ప్రతినిధి, ఆగస్టు 14: పులికాట్ దీవి మధ్యలో నివాసాలు ఏర్పాటు చేసుకొని, మత్స్యకార వృత్తిలో కొనసాగుతూ, ఎన్నో సౌకర్యాలకు దూరమైన ఇరకం తిరు వెంకట నగర్ కుప్పం గ్రామ ప్రజలు ఎదురు చూసిన కలను కూటమి ప్రభుత్వ పాలనలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, కలెక్టర్ వెంకటేశ్వర్ సహాయ సహకారాలతో గురువారం నెరవేరిందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ వెల్లడించారు. ఆ గ్రామానికి నలువైపులా ఉప్పునీటి సరస్సు, అక్కడకు వెళ్లాలంటే పడవ ప్రయాణం తప్పదు. ప్రయాణంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. వారి పిల్లలు కూడా విద్యాబుద్ధులకు, వైద్య సౌకర్యాలకు నోచుకోలేక కాలం గడిపారు. వారందరికి అందరికీ కల్పిస్తున్నసౌకర్యాలు, అందించాలని దిశగా గురువారం కలెక్టర్ గారి చొరవతో, రాష్ట్ర ప్రభుత్వం సహకారంతో జాతీయ రహదారికి సమీపంలోని తడ మండల పరిధిలో ఉన్న పూడి కుప్పం గ్రామ పరిధిలో ఆ గ్రామస్తులకు ఇల్లు నిర్మించుకొని ఇక్కడే నివాసం చేసేందుకు ఇంటి పట్టాలను కలెక్టర్ చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. స్థలాలు ఇవ్వడమే కాకుండా ప్రభుత్వపరంగా వారికి గృహాలు కూడా మంజూరు చేయనున్నట్లు ప్రకటించారు. దీంతో ఆ గ్రామ ప్రజలు కూటమి ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ సుబ్రహ్మణ్యం లకు రుణపడి ఉంటామని, ఏ ఎమ్మెల్యే చేయలేని పనిని మీరు చేయడం ఎంతో సంతోషంగా ఉందని వ్యక్తం చేశారు. అత్యవసర వేళలు వైద్య సౌకర్యాలకు, మా పిల్లలు పట్టణాలకు వెళ్లి, తిరిగి ఇంటికి చేరేందుకు మాకు ఇచ్చిన ఈ నివేశ స్థలాలో పక్కా గృహాలు ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తామని మత్స్యకార కుటుంబాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం, ఆర్డీవో కిరణ్మయి, సుధాకర్ రెడ్డి, సెల్వం,  తెలుగుదేశం నాయకులు, మత్స్యకార కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags:
Views: 1

Advertisement

Latest News

మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన మాచర్లలో జరిగిన సేవా పక్వాడ్ హెల్త్ క్యాంపులో ప్రజల నుంచి విశేష స్పందన
ఐ ఎన్ బి టైమ్స్ మాచర్ల ప్రతినిధి సెప్టెంబర్ 24:ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా, బుధవారం మాచర్ల పట్టణంలో నిర్వహించిన ‘స్వస్థ నారి –...
నేడు చిరుమామిళ్ళ చలమయ్య భౌతికకాయానికి నివాళులర్పించనున్న ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి
అది ఆటో స్టాండ్ కాదు..,!
ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదిన పక్షోత్సవాల్లో భాగంగా స్వస్థనారి సేవా పక్వాడ్ హెల్త్ క్యాంప్
మాచర్లలో స్వర్ణాంధ్ర-స్వచ్చాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు
మాచర్ల నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యకర్తలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమావేశం
ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా భీమా నాయక్ నియామకం