భూమిపై పెట్టుబడి పెడితే వారు ఎన్నటికీ నష్టపోరు :ప్రముఖ రచయిత,గాయకుడు
ఆస్కార్డ్ అవార్డు గ్రహీత చంద్ర బోస్
ఐ ఎన్ బి టైమ్స్ గూడూరు ప్రతినిధి, ఆగస్టు17:
విలువైన బంగారాన్ని ఉత్పత్తి చేయొచ్చు, భూమిని ఎవరు సృష్టించలేరు భూమిపై పెట్టుబడి పెట్టిన వారు ఎన్నటికీ నష్టపోరు అని ఆస్కార్ అవార్డు గ్రహీత, రచయిత గేయ కారుడైన చంద్ర బోస్ వివరించారు. చిల్లకూరు మండల పరిధిలోని నాంచారమ్మ పేట పంచాయితీలో ఏర్పాటుచేసిన శ్రేయ డెవలపర్& ఇన్ఫ్రాస్ట్రక్చర్ అధినేత కుంపటి. బాబు ఆగస్టీస్ ఏర్పాటుచేసిన సాగరమాల వెంచర్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గాయకుడు చంద్రబోస్, బుల్లితెర కథానాయి కిలు హిమజ, పూజా హెగ్డే చేతుల మీదుగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. వందలాది మంది భూమి కొనుగోలు దారుల మధ్య అక్కడ కోలాహలంగా మారింది. బుల్లితెర తారలను చూసేందుకు, చంద్ర బోస్ పాటలు వినేందుకు పరిసర ప్రాంత ప్రజల జన సందోహంగా మారింది. ఈ సందర్భంగా చంద్ర బోస్ మాట్లాడుతూ ప్రతి వ్యక్తికి అవసరమైన, అనువైన ప్రాంతాల్లో సరసమైన ధరలకే ప్లాట్లు అందుబాటులోకి తీసుకురావడం శ్రేయ డెవలపర్ అధినేత బాబు ఆగస్టీస్ కృషి పట్టుదల, నమ్మకం అనేదానికి నిదర్శనం అన్నారు. భూమిని నమ్ముకున్న ఎవ్వరు చితికి పోరు కానీ ఎన్నటికైనా భూమి పై పెట్టుబడి పెట్టిన ఎవరు నష్టపోరన్నారు. అదేవిధంగా బుల్లితెర తారలైన హిమజ, పూజా హెగ్డే ప్రతి కుటుంబానికి ఒక మంచి గృహం కావాలి, మంచి స్థలంలో నిర్మించుకోవాలి, ఆ స్థలం విలువ నానాటికి పెరగాలి అనే కోణంలో ఆలోచిస్తే శ్రేయ డెవలపర్ వేస్తున్న ప్రతి వెంచర్ రాబోవు రోజుల్లో లాభాలు చేకూర్చే విధంగానే ఏర్పాటు చేయడం ఆయనకు ఎవరు సాటి లేదన్నారు. చంద్ర బోస్ పలు గేయాలతో పాటు నాటు నాటు అనే పాటకు అందరిలో ఉత్తేజాన్ని నింపారు. రియల్ ఎస్టేట్ వ్యాపార రంగంలో ఉండవలసిన గుణ గణాలు కలిగిన నాయకుడిగా వ్యాపారాన్ని కొనసాగిస్తూ, ఎందరో కుటుంబాల్లో వెలుగులు నింపుతున్న మంచి నాయకుడిగా అభివర్ణించారు. అదేవిధంగా శ్రేయ డెవలపర్ సిఎండి బాబు అగస్టీస్ మాట్లాడుతూ ఏ వ్యాపారమైన నీతి నిజాయితీగా వ్యవహరిస్తూ, పోవాలన్నారు. వెంచర్ ప్రారంభోత్సవానికి ఆస్కార్ అవార్డు గ్రహీత గాయకుడు, రచయిత చంద్రబోస్, హిమజ, పూజా హెగ్డే లు చేతుల మీదుగా ప్రారంభోత్సవం జరగడం ఎంతో ఆనందదాయకం అన్నారు. అనంతరం పొదలకూరు టౌన్ లో నూతనంగా ఆ ప్రాంతంలో వ్యాపార రంగాన్ని విస్తరించేందుకు చంద్ర బోస్ చేతుల మీదుగా శ్రేయ డెవలపర్ కార్యాలయాన్ని ప్రారంభోత్సవం కూడా చేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ టీం లీడర్స్, సెల్లర్స్, వివర్స్, వెల్విషర్స్ తో పాటు స్థానిక నాయకుడు ప్రవీణ్ రెడ్డి, ధన శేఖర్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
Comment List